వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో కంప్లీట్ లాక్‌డౌన్: రోడ్డు మీదికొస్తే వీపు విమానం మోతే: మినహాయింపులివే

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఊహించిన పరిణామమే సంభవించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది. ఈ లాక్‌డౌన్.. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి అమల్లోకి రానుంది. 14 రోజుల పాటు కొనసాగుతుంది. వచ్చేనెల 10వ తేదీ తెల్లవారు జామున 6 గంటల వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ సందర్భంగా ఎలాంటి వ్యాపార కార్యకలాపాలకు అవకాశం ఇవ్వలేదు. అత్యవసర సర్వీసులు మినహా మరెలాంటి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు అందుబాటులో ఉండబోవని తెలిపింది.

Recommended Video

Karnataka Lockdown : EC Responsible For Second Covid Wave - Madras High Court | Oneindia Telugu
 వీకెండ్ లాక్‌డౌన్ మరింత విస్తృతం..

వీకెండ్ లాక్‌డౌన్ మరింత విస్తృతం..

కర్ణాటకలో వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కర్ణాటకలో 35 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగళూరులోనే వాటి సంఖ్య 20 వేలకు పైగా ఉంటోంది. దీన్ని నివారించడానికి బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం తొలుత రాత్రివేళ కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది. అనంతరం వీకెండ్ లాక్‌డౌన్‌ను విధించింది. 24, 25 తేదీల్లో కర్ణాటక వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగింది.

మే 10 వరకూ

మే 10 వరకూ


దీన్ని మరింత పొడిగించినట్లు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. వీకెండ్ లాక్‌డౌన్‌ను వచ్చేనెల 10వ తేదీ వరకు అమల్లో తెచ్చినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ ఉదయం కర్ణాటక మంత్రివర్గం సమావేశమైంది. దీనికి యడియూరప్ప సారథ్యాన్ని వహించారు. వైరస్‌ను నియంత్రించడానికి సంపూర్ణ లాక్‌డౌన్ విధించడమే మార్గమని తీర్మానించిది కేబినెట్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపింది. అధికారులు రూపొందించిన ఈ ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులు కూడా చేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మినహాయింపులివే..

మినహాయింపులివే..


లాక్‌డౌన్ సందర్భంగా అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇఛ్చింది ప్రభుత్వం. ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండదు. కేఎస్ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కబోవు. ప్రైవేటు వాహనాల రాకపోకలను నిషేధించారు. ఎలాంటి అత్యవసర కారణాలను చూపించకుండా రోడ్డెక్కిన వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. లాక్‌డౌన్ కాలంలో భవన నిర్మాణ పనులను కొనసాగించడానికి అనుమతి ఇచ్చామని యడియూరప్ప తెలిపారు. భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలు యధాతథంగా కొనసాగుతాయి. అలాగే- తయారీ, ఉత్పాదక సంస్థల కార్యకలాపాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.

నిత్యావసర సరుకుల వాహనాల రాకపోకలపై

నిత్యావసర సరుకుల వాహనాల రాకపోకలపై

పండ్లు, కూరగాయలు, పాల విక్రయ దుకాణాలు తెల్లవారు జామున 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచడానికి అనుమతి ఇచ్చినట్లు చెప్పారెు. 10 గంటల తరువాత ఆ షాపులను కూడా మూత వేయాల్సి ఉంటుందని అన్నారు. నిత్యావసర సరుకులను రవాణా చేసే వాహనాలకు అనుమతి ఉంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పండ్లు, కూరగాయలు, పాలు, మందులు, వ్యవసాయాధారిత పరికరాలు, వ్యవసాయోత్పత్తులను తరలించడంపై ఎలాంటి నిషేధం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవన్నీ యధాతథంగా కొనసాగుతాయని అన్నారు.

English summary
COVID curfew to be implemented in the state from tomorrow 9 pm for the next 14 days. Essential services allowed 6-10 am. After 10 am shops will close. Only construction, manufacturing and agriculture sectors allowed. Public transport to remain shut: Karnataka CM BS Yediyurappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X