ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం, మృతుల్లో పోలీసులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో విద్యుత్ షాక్‌కు గురై 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు పోలీసులు కూడా ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. చమోలీ జిల్లాలోని అలకనందా నదిపై ఉన్న నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
#WATCH | Uttarakhand: 10 people died and several were injured after a transformer exploded on the banks of the Alaknanda River in the Chamoli district. Injured have been admitted to the district hospital: SP Chamoli Parmendra Doval pic.twitter.com/QKC5vpvbF5
— ANI (@ANI) July 19, 2023
ఘటనకు సంబంధించి స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నమామీ గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనందా నదిపై ఉన్న బ్రిడ్జికి విద్యుత్ ప్రవాహం జరగడం వల్ల ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో బ్రిడ్జి రెయిలింగ్‌కు విద్యుత్ ప్రవహించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారని, వారిలో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, హోంగార్డులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. రెయిలింగ్‌కు విద్యుత్ ప్రవాహం జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఉత్తరాఖండ్ ఏడీజీపీ మురుగేశన్ తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందన్నారు. పీపల్ కోటి అవుట్ పోస్టు ఇంఛార్జీ కూడా మృతి చెందినవారిలో ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, ఈ ప్రమాదం మంగళవారం రాత్రి జరిగిందని చమోలీ ఎస్పీ ప్రమేంద్ర దోబాల్ తెలిపారు. బ్రిడ్జి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఒకరు విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 15 మంది మృతి చెందారని, మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని ఎస్పీ పేర్కొన్నారు.
Uttarakhand CM Pushkar Singh Dhami left for Dehradun to visit the spot in Chamoli, where 15 people died due to electrocution at the under-construction Namami Gange project on the banks of the Alaknanda River. pic.twitter.com/udnsa6Re11
— ANI (@ANI) July 19, 2023
కాగా, ఈ ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఘటనపై జ్యుడీసియల్ విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులను ఆదుకుంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మరోవైపు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications