ఘోర ప్రమాదం... కుప్పకూలిన ఐదంతస్తుల భవనం... శిథిలాల కింద 70 మంది...
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయగఢ్ జిల్లాలో ఓ బహుళ అంతస్తుల భవనం కూలి 15 మంది గాయపడ్డారు. మరో 70 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం అందగానే సహాయక చర్యల కోసం ముంబై నుంచి ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రాయ్‌గఢ్‌కి బయలుదేరాయి. ప్రమాద స్థలానికి చేరుకునేందుకు దాదాపు నాలుగైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
అది ఐదంతస్తుల భవనం అని... దాదాపు 45 ఫ్లాట్స్ వరకు ఉంటాయని స్థానికులు వెల్లడించారు. 'ఈరోజు సాయంత్రం 6.50గం. సమయంలో రాయ్‌గఢ్ జిల్లాలోని కాజల్‌పురాలో ఓ జీ+4 భవనం కుప్పకూలింది. దాదాపు 50 మంది శిథిలాల చిక్కుకుపోయినట్లు భావిస్తున్నాం. సహాయక చర్యల కోసం 3 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు బయలుదేరాయి.' అని ఎన్‌డీఆర్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు.

భవనం కుప్పకూలిన అనంతరం ఆ ప్రాంతమంతా దట్టమైన దుమ్ము,ధూళితో కమ్ముకుపోయినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది. గత నెలలో ముంబైలోనూ ఓ బహుళ అంతస్తుల భవనం కూలి 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా జూన్-సెప్టెంబర్ మాసాల్లో భారీ వర్షాల కారణంగా పురాతన భవనాలు,పాత భవనాలు కూలిపోతున్న ఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications