మోదీ సత్తా: సపోర్ట్ ఇచ్చిన 15 పార్టీల లిస్ట్.. ఇదే

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొత్తగా రూపుదిద్దుకున్న పార్లమెంట్ భవనం.. ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం వివాదాలకు దారి తీస్తోంది. దేశానికి ప్రథమ పౌరుడు, రాజ్యాంగానికి అధినేతగా భావించే రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ- మోదీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తోన్నారనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. ఇది- రాష్ట్రపతి హోదాను అవమానించడమేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళను రాష్ట్రపతిని చేసినట్లు చెప్పుకొంటోన్న బీజేపీ- ఆమెను కించపరుస్తోందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

15 parties including YSRCP and TDP will attend the inauguration of the new Parliament building

ఈ కార్యక్రమాన్ని 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), సమాజ్‌వాది పార్టీ, సీపీఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగల్ కచ్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివాల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ- హాజరు కావట్లేదు.

బీజేపీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలోని 15 భాగస్వామ్య పక్షాలు- కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరు కానున్నాయి. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతి కారీ మోర్చా, రాష్ట్రీయ లోక్ జన్‌శక్తి పార్టీ, అప్నా దళ్ (సోనేలాల్), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, తమిళ మానిల కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, మిజో నేషనల్ ఫ్రంట్, నాయకులు ఇందులో పాల్గొననున్నారు.

15 parties including YSRCP and TDP will attend the inauguration of the new Parliament building

దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తటస్థంగా వ్యవహరిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజూ జనతాదళ్, శిరోమణి అకాలీదళ్.. కూడా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించాయి. గతంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండి, ఆ తరువాత ప్రతిపక్షాలతో జట్టు కట్టి.. ఇప్పుడు మళ్లీ బీజేపీకి చేరువ కావడానికి ప్రయత్నిస్తోన్న తెలుగుదేశం పార్టీ సైతం ఈ కార్యక్రమానికి హాజరుకానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+