స్టూడెంట్ ను రేప్ చేసిన ప్రిన్సిపాల్ అరెస్టు
ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్ లో విద్యార్థిని మీద ప్రిన్సిపాల్ అత్యాచారం చేసిన సంఘటన ఇటివల వెలుగు చూసింది. దినేష్ కుమార్ అనే కామాంధుడు అత్యాచారం చేశాడని పోలీసులు అన్నారు. విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ముజఫర్ నగర సమీపంలో షమిలిలో దినేష్ కుమార్ అనే వ్యక్తి సొంతంగా ప్రయివేటు స్కూల్ నడుపుతున్నాడు. ఇదే స్కూల్ లో 15 సంవత్సరాల బాలిక ఆరవ తరగతి చదువుతున్నది. దినేష్ కుమార్ కన్ను బాలిక మీద పడింది. సమయం కోసం వేచి చూశాడు.

ఇటివల దినేష్ కుమార్ బాలికను స్కూల్ అయిపోయిన తరువాత గదిలోకి తీసుకు వెళ్లాడు. హోం వర్క్ పేరుతో బాలికను స్కూల్ లోనే పెట్టుకుని అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని చెప్పి ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్లిన బాలిక శరీరంలో మార్పులు గుర్తించిన కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీశారు.
బాలిక జరిగిన విషయం చెప్పింది. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో ముజఫర్ నగర పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్ దినేష్ కుమార్ ను అరెస్టు చేశారు. బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు నిర్వహించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications