హిమాచల్ ప్రదేశ్ పోల్: 157 పోలింగ్ స్టేషన్లలో మహిళలే సిబ్బంది, తగిన ఏర్పాట్లు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఓటు వేసేందుకు జనాలు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. వయోజనులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేసింది. సాయంత్రం వరకు పోలింగ్ జరగనుంది.
పోలింగ్ విధుల్లో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉన్నారు. అవును రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి 157 పోలింగ్ స్టేషన్లలో మహిళ సిబ్బందే ఉన్నారు. వారే ఓటింగ్ సరళిన పర్యవేక్షిస్తున్నారు. ఇదీ నిజంగా విశేషమే. అయితే హమీరూ పూర్ జిల్లాలో పిల్లలతో వచ్చేవారికి సమస్య రాకుండా తగిన ఏర్పాట్లు చేసింది.

పిల్లలను ఆడించడానికి సదుపాయం కల్పిస్తున్నారు. ఈ మేరకు సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు. ఎన్నికల విధులను మహిళలే నిర్వహించడం భేష్.. తాము అన్నీ రంగాల్లో ఉన్నామంటోన్న అతివలకు, ఇదీ చక్కని ఛాలెంజ్. అందుకే వారు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
మరోవైపు విజయంపై బీజేపీ ధీమాతో ఉంది. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠారూర్ అభిప్రాయ పడ్డారు. సీఎం జైరామ్ ఠాకూర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. సో.. మరోసారి ప్రజలు తమకు అవకాశం కల్పిస్తారని విశ్వాసంతో ఉన్నారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఇదిలా ఉంటే మరోవైపు జైరామ్ ఠాకూర్ తమ సీఎం అభ్యర్థి అని బీజేపీ స్పష్టంచేసింది. తమకు స్పష్టమైన మెజార్టీ వస్తోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటున్నారు.












Click it and Unblock the Notifications