షాకింగ్: తండ్రిని కొట్టిచంపి పోలీసులకు ఫోన్ చేసిన యువతి, ఎందుకో తెలుసా?

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోజూ మద్యం తాగి వచ్చి తల్లిని వేధింపులకు గురిచేస్తున్నాడని తీవ్ర వేదనకు గురైన ఓ 16ఏళ్ల యువతి.. కన్నతండ్రిని దారుణంగా కొట్టి చంపేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి తండ్రి నిరుద్యోగి. భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్న అతని పెద్ద కొడుకు సంపాదపైనే వారి కుటుంబమంతా అంతా ఆధారపడి ఉన్నారు. ఏ పనీ లేకుండా ఖాళీగా ఉంటున్న తండ్రి.. రోజూ మద్యం సేవించి వచ్చి తల్లిని కొడుతుండేవాడు.

16-year-old girl beats father to death for assaulting mother, dials 100 to surrender

కాగా, బుధవారం సాయంత్రం పెద్ద కొడుకు వివాహం గురించి కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న సమయంలో.. మద్యం సేవించి వచ్చిన తండ్రి గొడవకు దిగాడు.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి.. సమీపంలోనే ఉన్న బ్యాటును తీసుకుని తండ్రి తలపై గట్టిగా బాదింది. అలాగే వరుసగా నాలుగైదు దెబ్బలు వేయడంతో అతడు కుప్పకూలాడు.

తీవ్రరక్త స్రావం కావడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత నిందిత యువతి పోలీసులకు ఫోన్ చేసి తాను తన తండ్రిని హత్య చేశానని తెలిపింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ యువతిని అదుపులోకి తీసుకుని, జువైనల్ హోంకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+