Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇరాన్ సీజ్ చేసిన నౌకలో 17 మంది భారతీయులు: రంగంలోకి కేంద్రం

ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తలు తారస్థాయికి చేరాయి. దీంతో పశ్చిమాసియా ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉండటంతో ఎప్పుడేం జరుగుతోంనని ఇజ్రాయెల్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, హార్మూజ జలసంధి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగిన ఇరాన్ కమాండోలు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో భారతీయులను విడిపించేందుకు ఇరాన్ అధికారులతో భారత్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు, ఈ ఘటనపై స్పందించింది ఇజ్రాయెల్. వివాదాన్ని తీవ్రతరం చేయడం వల్ల ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఇరాన్ కు ఇజ్రాయెల్ హెచ్చరించింది.

17 Indians onboard Israeli-linked ship seized by Iran Centre says release efforts on

కాగా, హెలికాప్టర్ సాయంతో నౌకను వెంబడించిన ఇరాన్ నేవీ ప్రత్యేక బలగాలు దాన్ని నియంత్రణలోకి తీసుకున్నట్లు టెహ్రాన్ మీడియా వెల్లడించింది. అంతకుముందు బ్రిటన్ కు చెందిన యూకే మారిటైమ్ ఏజెన్సీ కూడా నౌక సీజ్ సమాచారాన్ని తెలియజేసింది. ప్రస్తుతం నౌకను ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు మళ్లించినట్లు తెలిసింది. పోర్చుగల్ జెండాతో ఉన్న ఆ వాణిజ్య నౌకను.. ఇజ్రాయెల్ సంపన్నుడు ఇయాల్ ఒఫర్ జోడియాక్ సంస్థకు చెందిన ఎంఎస్సీ ఏరిస్ దిగా భావిస్తున్నారు.

అయితే, కొద్ది రోజుల క్రితం సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడిలో రివల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన కీలక సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ నిశ్చియించుకుంది. ప్రతి దాడి తప్పదని ఇప్పటికే ఇజ్రాయెల్ కు హెచ్చరించింది. అంతేగాక, తమ మధ్యలో అమెరికా తలదూర్చకూడదని కోరింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్-హమాస్ వరకే పరిమితమైన ప్రస్తుత యుద్ధంగా.. మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే అవకాశం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+