ఘోర రోడ్డు ప్రమాదం: 17మంది అక్కడికక్కడే మృతి
రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. ప్రయాణికులతో వెళుతున్న జీపును ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 17మంది మృత్యువాతపడ్డారు.
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. ప్రయాణికులతో వెళుతున్న జీపును ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 17మంది మృత్యువాతపడ్డారు.
హనుమాన్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావత్సర్-హనుమాన్‌గఢ్ మెగా హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు అతివేగంగా ఢీకొనడంతో జీపు నుజ్జునుజ్జయింది. మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి.

ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించనున్నట్లు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌హెచ్ఓ అన్వర్ ఖాన్ తెలిపారు.












Click it and Unblock the Notifications