Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియాలో ఉండలేం బాబోయ్..! 12 ఏళ్లలో 17 లక్షల మంది జంప్-2022లో అత్యధికం..

భారత్ లో మారుతున్న పరిస్ధితులు ఇక్కడి పౌరుల్ని స్ధిమితంగా ఉండనీయడం లేదా ? మన దేశంలో కంటే విదేశాల్లోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, సురక్షితంగా ఉంటామని భావిస్తున్నారా ? జీవన స్ధాయిలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో విదేశాలకు మన పౌరులు తరలిపోతున్నారా ? ఇవన్నీ నిజమే అని తాజాగా బయటపడుతున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని కేంద్రం కూడా పార్లమెంటులో గణాంకాలతో సహా తేల్చిచెప్పేసింది.

గత 12 ఏళ్లలో దాదాపు 17 లక్షల మంది భారతీయులు దేశం వదిలి వెళ్లిపోయారు. వివిధ కారణాలతో వీరంతా ఈ పుష్కర కాలంలో భారతీయ పౌరసత్వం తమకు వద్దనుకుని విదేశాలకు వెళ్లిపోయారు. వీరిలో ఉన్నత విద్య కోసం వెళ్లిన వాళ్లు, ఉద్యోగాల వేటలో వెళ్లిన వాళ్లు, విదేశాల్లో అప్పటికే స్ధిరపడిన తమ వాళ్ల వద్దకు వెళ్లిన వాళ్లు, విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించి అక్కడికి వెళ్లిపోయిన వాళ్లు, విదేశాల్లో జీవన స్ధాయిలు ఎక్కువగా ఉండటం వల్ల వెళ్లిన వాళ్లు, దేశంలో పరిస్ధితులు నచ్చక వెళ్లిపోయిన వాళ్లు ఇలా పలు కేటగిరీల వాళ్లు ఇందులో ఉన్నారు.

17 lakh indians give up citizenship in last 12 years-here are reasons..

గత పుష్కర కాలంలో దేశం నుంచి 16.63 లక్షల మంది తమ పౌరసత్వం వదులుకుని విదేశాలకు వెళ్లిపోయినట్లు కేంద్రమంత్రి మురళీధరన్ తాజాగా పార్లమెంటులో వెల్లడించారు. 2014 నుంచి 2022 మధ్య 12.88 లక్షల మంది భారత్ వదిలి వెళ్లిపోయినట్లు ఆయన తెలిపారు. 2022లో ఇలా వలస వెళ్లిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 2022లో అత్యధికంగా 2.25 లక్షల మంది భారత పౌరసత్వం వదులుకుని వెళ్లిపోయారు. అలాగే 2014-2022 మధ్య 2.64 లక్షల మంది తమ పాస్ పోర్టులు అప్పగించేశారని తేలింది.

2014 నుంచి 2022 వరకూ అంటే మోడీ సర్కార్ అధికారంలో ఉన్న ఈ ఎనిమిదేళ్లలో 2.64 లక్షల మంది పాస్ పోర్టులు అప్పగించేయగా.. ఇందులో అత్యధికంగా ఢిల్లీ ప్రజలు 60 వేల మంది, పంజాబ్ వారు 28 వేల మంది, గుజరాత్ వారు 22 వేల మంది, గోవా నుంచి 16 వేల మంది ఉన్నారు. అలాగే ఏపీకి చెందిన 9 వేల మంది, తెలంగాణకు చెందిన 7 వేల మంది కూడా ఇలా విదేశాలకు వలస వెళ్లిపోతూ పాస్ పోర్టుకు సరెండర్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+