Bank Of Baroda: బ్యాంక్ లాకర్‍లో డబ్బు దాచిన మహిళ.. చెదలు పట్టి రూ.18 లక్షలు ధ్వంసం..
మనం భూమి అమ్మిన లేదా ఏదో రూపంలో అధికంగా డబ్బు వస్తే ఏం చేస్తాం.. ఆ డబ్బుతో భూమి లేదా, ఇల్లు లేదా కూతుళ్లకు పెళ్లి చేయాలనుకుంటాం. అయితే మనం అకున్న వెంటనే ఏ పనులు కావు. దీంతో ఇంట్లో అంత డబ్బు ఎందుకని బ్యాంకులో వేస్తాం. ఇలానే ఓ మహిళ తన కూతురు పెళ్లి కోసం కూడబెట్టిన సొమ్మును బ్యాంకు లాకర్ లో భద్రపరిచింది. అయితే లాకర్ లో భద్రపరిచిన డబ్బుకు చెదలు పట్టడంతో సొమ్మంతా నాశనమైంది. పనికి రాకుండా పోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.
మొరాదాబాద్‌లోని ఓ మహిళ కష్టపడి సంపాదించిన రూ.18 లక్షలను కూతురు పెళ్లి కోసం బ్యాంకు లాకర్‌లోకి ఉంచారు. కానీ ఆ డబ్బును చెదలు పురుగులు తినేశాయి. ఈ సంఘటన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆషియానా బ్రాంచ్‌లో జరిగింది. అల్కా పాథక్ అనే మహిళ గత సంవత్సరం అక్టోబర్ నుంచి తన డబ్బును బ్యాంకు లాకర్ లో పెట్టింది. తాజాగా బ్యాంక్ అధికారులు ఆమెను సంప్రదించారు. వారు లాకర్ అగ్రిమెంట్ పునరుద్ధరణ, ఆమె 'నో యువర్ కస్టమర్' (KYC) వివరాలను అప్‌డేట్ చేయడానికి బ్రాంచ్‌లో హాజరు కావాలని కోరారు.

దీంతో పాఠక్ తన లాకర్‌ని తెరిచి అందులో ఉన్న వస్తువులను తనిఖీ చేయగా, ఆమె తన కుమార్తె పెళ్లి కోసం పక్కన పెట్టిన కరెన్సీ నోట్లు చెదలు పురుగు సోకడంతో ధ్వంసమైనట్లు గుర్తించారు. డబ్బును చెదలు పెరుగు తినడంపై పాఠక్‌తో పాటు బ్యాంకు అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి వార్తలు వైరల్ కావడంతో బ్యాంక్ సిబ్బంది బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయానికి నివేదికను పంపినట్లు తెలిపారు.
బ్యాంక్ అధికారులు సమాచారాన్ని దాచిపెడుతున్నారని పాఠక్ ఆరోపించారు. "నాకు బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన, మద్దతు లభించకపోతే, ఈ విషయాన్ని దృష్టికి తీసుకురావడానికి మీడియా సహాయం కోరడం గురించి ఆలోచిస్తాను" అని ఆమె వ్యాఖ్యానించారు. బ్యాంక్ లాకర్లలో నగదు నిల్వ చేయడాన్ని నిషేధిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడం గమనించదగ్గ విషయం. బ్యాంక్ ఆఫ్ బరోడా లాకర్ ఒప్పందం స్పష్టంగా నిర్దేశిస్తుంది. "లాకర్‌ని ఉపయోగించడానికి లైసెన్స్‌ని మంజూరు చేయడం కేవలం ఆభరణాలు, పత్రాలు వంటి విలువైన వస్తువులను నిల్వ చేయడం వంటి చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం మాత్రమే కానీ ఏదైనా నగదు లేదా కరెన్సీని నిల్వ చేయడానికి కాదు" నిబంధనలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications