బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లో ఎస్కలేటర్ నుంచి జారి చిన్నారి మృతి, అధికారులు!
బెంగళూరు: బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లోని ఎస్కలేటర్ నుంచి కింద జారిపడిన చిన్నారి మరణించింది. తీవ్రగాయాలైన హరిణి అలియాస్ హాసిని (18 నెలలు ) చికిత్స విఫలమై మరణించిందని సోమవారం బెంగళూరులోని సుబ్రమణ్య నగర పోలీసులు తెలిపారు.
ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో హాసిని అనే చిన్నారి తల్లి, అవ్వతో కలిసి శ్రీరాంపుర మెట్రో రైల్వేస్టేషన్ చేరుకుంది. తరువాత ముగ్గురూ ఎక్సలేటర్ మీద వెలుతున్న సమయంలో చిన్నారి హాసిని జారి కింద పడిపోయింది. ఎక్సలేటర్ నుంచి చిన్నారి కిందకు జారి నేల మీద పడిపోయింది.

విషయం గుర్తించి మెట్రో రైల్వే సిబ్బంది వెంటనే ఎక్సలేటర్ నిలిపివేశారు. హాసినిని వెంటనే ఇందిరాగాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై చిన్నారి హాసిని మరణించిందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల నిర్లక్షం వలనే చిన్నారి హాసిని మరణించిందని అధికారులు ఆరోపిస్తున్నారు.
మెట్రో రైల్వేస్టేషన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికులకు పలు జాగ్రత్తలు సూచించాలని, ఇప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని ప్రజలు అంటున్నారు. ఇటీవల నేషనల్ కాలేజ్ మెట్రో రైల్వేస్టేషన్ పట్టాల మీద పడిన యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు, ఈ సంఘటన మరువక ముందే చిన్నారి హాసిని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications