ఏం మనుషులురా మీరు.. 4 లక్షల మంది మహిళలపై పాక్ ఆర్మీ అత్యాచారం..

మహిళల హక్కులపై ఐక్యరాజ్యసమితిలో జరిగిన చర్చలో పాకిస్థాన్ నీచబుద్ధిని, దాష్టీకాన్ని భారత్ బట్టబయలు చేసింది. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ యుద్ధంలో పాకిస్థాన్ ఆర్మీ చేసిన ఆకృత్యాల్ని వివరించింది. పాక్ ఆర్మీ క్రూరమృగాల్లా మారి దాదాపు 4 లక్షల మంది మహిళలపై అత్యాచారం చేశారని మండిపడింది. మానవత్వానికే ఇది మాయని మచ్చ అని అభివర్ణించింది భారత్. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశంలో భారత్.. పాకిస్థాన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్.. ఆ దేశ ఆర్మీ సైతం ఉగ్రమూకలకంటే భయంకరం అని స్పష్టం అవుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో మహిళల హక్కులపై జరిగిన సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్.. పాకిస్థాన్ పై విరుచుకుపడ్డారు. మహిళలకు పాకిస్థాన్ ఆర్మీ ఇచ్చే గౌరవంపై ప్రశ్నలు లేవనెత్తారు. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఉద్ధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఆపరేషన్ సెర్చ్ లైట్ లో భాగంగా పాక్ ఆర్మీ చేసిన దాష్టీకాలను భారత్ ఐరాస ముందు పెట్టింది. దాదాపు 4 లక్షలమంది మహిళలపై పాకిస్థాన్ సైనికులు అత్యాచారానికి పాల్పడ్డారని మండిపడ్డారు యూఎన్ లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్.

ఐరాసలో కాశ్మీర్ లో మహిళలపై పాకిస్థాన్ లేవనెత్తిన అంశంపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా పాకిస్థాన్ ఆర్మీ ప్రవర్తించిందని దుయ్యబట్టారు. కాశ్మీర్ లో మహిళలపై మాట్లాడే నైతిక హక్కు పాకిస్థాన్ కు లేదని కుండబద్దలు కొట్టారు.1971లో ఆపరేషన్ సెర్చ్ లైట్ లో భాగంగా సామాన్య ప్రజలపై పాకిస్థాన్ ఆర్మీ క్రూరమృగాల కంటే కఠినంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. పాకిస్థాన్ కు చెందిన రజాకార్ ఫోర్స్, ఆర్మీ కలిసి బంగ్లాదేశ్ లోని మహిళలపై అత్యాచారాని ఒడిగట్టారని భారత్ పేర్కొంది.

1971 s Dark Legacy Pakistani Forces Rape of 400 000 Bangladeshi Women

ఓ పద్ధతి ప్రకారం దాదాపు 4 లక్షల మంది బంగ్లాదేశీ మహిళలపై అత్యాచారం నిర్వహించారని భారత్ గుర్తుచేసింది. పాకిస్థాన్ క్రూరమైన చర్యల వల్ల యుద్ధ సమయంలోనే లక్షలాది మంది మహిళలు ప్రెగ్నెంట్ అయ్యారని.. మరికొందరు బిడ్డలు జన్మనిచ్చారని.. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఇంకొందరు అబార్షన్స్ చేయించుకున్నారని తేలింది. 1971 డిసెంబర్ లో భారత్ ఆర్మీకి పాకిస్థాన్ ఆర్మీ సరెండర్ అయినప్పుడు మాత్రమే ఈ ఘటనలు ఆగిపోయాయని భారత్ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+