1993 ముంబై వరుస పేలుళ్ల దోషి యుసుఫ్ మెమన్ మృతి
ముంబై: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యూసుఫ్ మెమన్ శుక్రవారం జైలులో మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాసిక్ జైలులో శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అతడు గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.
అయితే, యూసుఫ్ ఎలా మరణించాడనే విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ముంబైలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అయిన టైగర్ మెమన్‌కు యూసుఫ్ మెమన్ సోదరుడు. ముంబై వరుస పేలుళ్ల కేసులో 2007లో దోషిగా తేలడంతో యూసుఫ్‌కు జీవిత ఖైదు పడింది. దీంతో అతడిని తొలుత ముంబైలోని ఆర్థర్ రోడ్డులోని జైలులో ఉంచారు.

ఆ తర్వాత 2018లో అక్కడ్నుంచి నాసిక్ జైలుకు మార్చారు. అక్కడే శిక్ష అనుభవిస్తున్న యూసుఫ్‌కు శుక్రవారం ఉదయం 10.30గంటలకు గుండెపోటు రావడం మరణించినట్లు తెలిసింది. యూసుఫ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధూలేకు తరలించారు.
ముంబై వరుస బాంబు పేలుళ్ల ఘటన తర్వాత గ్యాంగ్‌స్టర్ టైగర్ మెమన్ భారత్ నుంచి పరారయ్యాడు. 1993 మార్చి 12న ముంబైలో బాంబు పేలుళ్ల ఘటనలో 257 మంది మృతి చెందగా, 1400 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, యూసుఫ్ సోదరుడు ఇసాక్ మెమన్ కూడా ప్రస్తుతం నాసిక్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications