Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నుహ్‌లో హింసాత్మక ఘటనలు: ఇద్దరు మృతి, కర్ఫ్యూ విధింపు

ఛండీగఢ్: హర్యానాలోని నుహ్(Nuh)లో స్థానికంగా ఓ మతపరమైన ఊరేగింపుపై కొంతమంది రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. పలు కార్లను తగులబెట్టారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు మరణించారు. కనీసం 15 మంది పోలీసులతో సహా, పలువురు గాయపడ్డారు.

గాయపడిన ఎనిమిది మంది పోలీసు సిబ్బందిని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. హోంగార్డులలో ఒకరు నీరజ్ తుపాకీ గాయం కారణంగా మరణించారని మరొక పోలీసు అధికారి ధృవీకరించారు. గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు షెల్స్‌ను ప్రయోగించారు.
గాల్లోకి కాల్పులు జరిపారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా బలగాలు మోహరించాయి. ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్, మెసేజింగ్ సేవలు నిలిపివేయబడ్డాయి.

 2 killed, 15 Injured In Nuh Violence, Haryana; Curfew Clamped As Internet, SMS Services Suspended

అంతకుముందు రోజు, విశ్వ హిందూ పరిషత్ బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్రను నూహ్‌లోని ఖేడ్లా మోడ్ సమీపంలో కొంతమంది యువకులు అడ్డుకున్నారు. ఆ ఊరేగింపుపై రాళ్లు విసిరినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఊరేగింపులో ఉన్న వ్యక్తులు తమను అడ్డుకున్న యువకులపై రాళ్లు రువ్వారు.
దీనికంతటికి ఓ వీడియో కారణమైనట్లు స్థానిక వార్తాసంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను రప్పించారు.

ఊరేగింపులో భాగమైన కనీసం నాలుగు కార్లకు నిప్పు పెట్టారు. పోలీసు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. నుహ్, గురుగ్రామ్ జిల్లాల్లో ప్రజలు సమావేశాన్ని నిషేధిస్తూ నిషేధాజ్ఞలు విధించారు. తీవ్రమైన మతపరమైన ఉద్రిక్తతను నియంత్రించడానికి మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను ఆగస్టు 2 (బుధవారం) వరకు నిలిపివేసినట్లు హర్యానా ప్రభుత్వం తెలిపింది.

ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని నూహ్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వార్ తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ విధించాం.. కర్ఫ్యూ ఆదేశాలు ఇచ్చాం.. శాంతిభద్రతలను కాపాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని, జిల్లాలో కర్ఫ్యూ విధించగా పరిస్థితి సాధారణంగానే ఉందని స్పష్టం చేశారు.

శాంతి కోసం విజ్ఞప్తి చేశారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఘర్షణలకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. "నేటి ఘటన దురదృష్టకరం, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని" ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

నుహ్‌లోని శివాలయంలో ఆశ్రయం పొందిన 2,500 మంది పురుషులు, మహిళలు, పిల్లలను పోలీసులు ఖాళీ చేయించినట్లు హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఘటనా స్థలంలో తగిన బలగాలను మోహరిస్తున్నట్లు హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. మేవాత్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారందరినీ కాపాడుతున్నామని ఆయన తెలిపారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్ జిల్లాలోని సోహ్నాలో కూడా హింస చెలరేగడంతో, 15 కంపెనీల అదనపు కేంద్ర బలగాలను హర్యానాకు పంపుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+