గాలీవాన బీభత్సం: ఇద్దరి మృతి- అంధకారం: భారీ హోర్డింగులు సైతం..

Delhi Rains: దక్షిణాదితో పాటు ఉత్తరాది రాష్ట్రాలు అతి భారీ వర్షాలను ఎదుర్కొంటోన్నాయి. ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలను చవి చూస్తోన్నాయి. కాశ్మీర్ నుంచి మధ్యప్రదేశ్ వరకూ వర్షాలు కుమ్మేస్తోన్నాయి. ఈ భారీ వర్షాలకు డస్ట్ స్టార్మ్ కూడా తోడయ్యాయి. ప్రత్యేకించి దేశ రాజధాని దీని బారిన పడింది.

ఈ సాయంత్రం ఒక్కసారిగా ఢిల్లీ వాతావరణం మారిపోయింది. భీకరంగా తయారైంది. హోరుమంటూ ఈదురుగాలులు ఢిల్లీవాసులను భయపెట్టాయి. అదే సమయంలో డస్ట్ స్టార్మ్ ఈ నగరాన్ని చుట్టుముట్టింది. 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో దుమ్ము లేచిందక్కడ. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని అనేక ప్రాంతాలు దీని బారిన పడ్డాయి.

2 killed and several injured in Delhi rains

డస్ట్ స్మార్మ్ చెలరేగిన సమయంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. తూర్పు ఢిల్లీలోని యమునా విహార్, భజన్ పురా, గోకుల్ పురి.. ప్రాంతాల్లో అంధకారం ఏర్పడింది. ఒకవంక వర్షం, దుమ్ము తుఫాన్, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో జనం ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.

ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమానాల రాకపోకల సమయాల్లో మార్పులు ఉంటాయని తెలిపింది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సంబంధిత విమానయాన సంస్థను సంప్రదించాలని సూచించింది.

ఢిల్లీలో తీవ్రమైన దుమ్ము తుఫాను, ఉరుములు, వడగళ్ల వర్షం కారణంగా రాజధాని అంతటా విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. బవానా, నరేలా, జహంగీర్‌పురి, సివిల్ లైన్స్, శక్తి నగర్, మోడల్ టౌన్, వజీరాబాద్, ధీర్‌పూర్, బురారి వంటి ప్రాంతాలలో అంధకారం ఏర్పడింది.

చెట్లు, వాటి కొమ్మలు విరిగిపడటం వల్ల విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి ముందుజాగ్రత్తగా కొన్ని ప్రాంతాలలో సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని టాటా పవర్-డీడీఎల్ తెలిపింది. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ చెట్లను తొలగించడంలో నిమగ్నం అయ్యారని వివరించింది.

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో చాలా వరకు విద్యుత్ పునరుద్ధరణ శరవేగంగా సాగుతోందని వెల్లడించిందా సంస్థ. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, నేల వాలిన తీగలను సరిచేస్తోన్నామని వివరించాయి. దీనికోసం అదనపు సిబ్బందిని మోహరింపజేసినట్లు పేర్కొన్నాయి.

2 killed and several injured in Delhi rains

పండిట్ పంత్ మార్గ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్, జన్ పథ్ రోడ్, మింటో బ్రిడ్జి, తీన్ మూర్తి మార్గ్, గీతా కాలనీ, హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా సెక్టార్ 16.. వంటి ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అర్ధరాత్రి వరకూ ట్రాఫిక్ కదల్లేదు. వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు.

నిజాముద్దీన్ ఫ్లైఓవర్, నోయిడా- గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ వే.. వంటి ప్రాంతాల్లో భారీ హోర్డింగులు సైతం చిత్తు కాగితాల్లా నేలకూలాయి. ఆయా సంఘటనల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. 11 మందికి పైగా గాయపడ్డారు. లోధీ రోడ్ లో ఓ విద్యుత్ స్తంభం విరిగి మీద పడటంతో ఒకరు మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+