ఎదురుకాల్పులు: ఇద్దరు తీవ్రవాదుల హతం
గౌహతి: అస్సాం రాష్ట్రం దుబ్రి జిల్లా చలిబుయి ప్రాంతంలో తీవ్రవాదులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారు. సైన్యం, పోలీసు అధికారులు సంయుక్తంగా ఆదివారం రాత్రి నుంచి ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు.
సోమవారం తెల్లవారుజాము వరకు కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. తీవ్రవాదుల వద్ద నుంచి ఏకె 56 రైఫిల్, 9ఎంఎం తుపాకీ, హ్యాండ్ గ్రెనేడ్స్ తదితర ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. మృతి చెందిన తీవ్రవాదులు ఏ తీవ్రవాద సంస్థకు చెందినవారో గుర్తించాల్సి ఉందని చెప్పారు.
ఇద్దరు దళితుల దారుణ హత్య

పాట్నా: ఇద్దరు దళితులను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంగర్ జిల్లా పచ్‌రుకి ప్రాంతానికి చెందిన ఇద్దరు దళితులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. మృతులు అనిల్ పసి, సేతో పసిగా పోలీసులు గుర్తించారు.
మృతుల గొంతు వద్ద పదునైన ఆయుధాలతో గాయపరిచినట్లు గుర్తులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications