ఎన్‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదుల హతం, ఇద్దరు పోలీసుల మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా జిల్లా ఆరంపొరాలో గస్తీ నిర్వర్తిస్తున్న సైనికులపై ముష్కరులు దాడికి తెగబడ్డారు.
సమచారం అందుకున్న అధికారులు అదనపు బలగాలను మోహరించారు. మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.

మంగళవారం రాత్రి వరకు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో నలుగురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతా సిబ్బంది వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరింత మంది ముష్కరులు ఉండొచ్చనే అనుమానంతో గాలింపు చేపట్టారు. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. మంగళవారం నుంచి ఆపరేషన్ కొనసాగుతోందని భద్రతా దళాలు బుధవారం తెలిపాయి. బుధవారం మరోసారి ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారని తెలిపారు. భద్రతా దళాలు ఉగ్రవాదులను దాడులను తిప్పికొడుతున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications