వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతిని రేప్ చేసి.. వీడియో తీశాడు, నెట్లో పెడతానని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఇరవై ఏళ్ల యువతి పైన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. దానిని చిత్రీకరించి, ఎవరికైనా చెబితే ఇంటర్నెట్లో పెడతానని బెదిరించిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. నవాబ్గరీ గ్రామంలో ఈ సంఘటన నెల కిందట జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దాదాపు నెల రోజుల క్రితం బాధితురాలు తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు మున్వర్ యువతి నివాసంలోకి వచ్చాడు. ఆమె పైన అత్యాచారం జరిపాడు. దీనిని తన సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. అనంతరం ఆమెను బెదిరించాడు. ఎవరికైనా చెబితే దానిని నెట్లో పెడతాడని ఆమె భయంతో మిన్నకుండిపోయింది.

అత్యాచారం జరిగిన నెల తర్వాత నిందితుడు బాధితురాలిని శుక్రవారం తన ఇంటికి రావాలని కోరాడు. ఆమె తిరస్కరించింది. అనంతరం ఆమె తల్లిదండ్రులతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని అతనికి చెప్పింది. మున్వర్ వద్దకు వెళ్లేందుకు బాధితురాలు నిరాకరించడంతో.. అతని స్నేహితులు ఆమె పైన దాడి చేశారు.

20 year old girl raped inside her residence

దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్వర్, ఆమె పైన దాడికి పాల్పడిన ముగ్గురు స్నేహితుల పైన కేసు నమోదు చేశారు.

'ఆడపిల్లల కదలికలపై నిఘా పెట్టండి'

ఆడపిల్లల భద్రత పేరిట జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాళ్ల సంఘం దక్షిణ బెంగళూరులోని కళాశాలలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థినులు ఇంటి దగ్గర బయల్దేరింది మొదలు తిరిగి ఇల్లు చేరేదాకా వారి కదలికలపై కన్నేసి ఉంచాలన్నది అందులో మొదటిది. కాకపోతే ఇందుకోసం వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలన్న షరతు పెట్టారు.

కాలేజీకి వచ్చేటపుడు, వెళ్లే సమయంలో వారి వెంట ఉంటున్నదెవరో గమనించాలి. అనుమానం కలిగితే వారితో విద్యార్థినుల ప్రవర్తన ఎలా ఉంటోందో నిఘా వేయాలి. ప్రతి కాలేజీలో మహిళా కమిటీ ఏర్పాటు చేయాలి. విద్యార్థినులపై నిఘా పెట్టే వారి కోసం ఎంపికలో మహిళలకు ప్రాధాన్యమివ్వాలి. ఇలా 34 అంశాలతో భద్రత కేటలాగ్‌ను కాలేజీలకి పంపించింది. అయితే, దీంతో తమకు సంబంధం లేదని ఇంటర్ విద్యా విభాగం డీడీ చెప్పారు.

English summary
20 year old girl raped inside her residence in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X