వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిదశలో చురుగ్గా సాగిన పోలింగ్ ,2014 ఎన్నికలకు దగ్గరగా ఓటర్ టర్నవుట్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో మొదటిదశ పోలింగ్ సజావుగా ముగిసింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలిదశ ఎన్నికల్లో 10రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే తొలి దశ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో 2014 లో నమోదైన పోలింగ్ శాతాలకు అటు ఇటుగా ఈసారి కూడా ఓటింగ్ నమోదైంది.

రాజకీయ పార్టీలకు ఝలక్! విరాళాల వివరాలు చెప్పాల్సిందేనన్న సుప్రీంకోర్ట్!రాజకీయ పార్టీలకు ఝలక్! విరాళాల వివరాలు చెప్పాల్సిందేనన్న సుప్రీంకోర్ట్!

పోలింగ్‌లో త్రిపుర ఫస్ట్

పోలింగ్‌లో త్రిపుర ఫస్ట్

సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ క్యూలు కనిపించాయి. ఏపీలో అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. గతంతో పోలిస్తే ఈసారి తగ్గినప్పటికీ పోలింగ్‌‌లో త్రిపుర టాప్ ప్లేస్‌లో ఉంది. అక్కడ 81.8శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014లో త్రిపురలో 85.4శాతం పోలింగ్ నమోదైంది. 80శాతం పోల్ పర్సెంటేజ్‌తో బెంగాల్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ 82.7 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో ఓటర్ల ఉత్సాహం

ఈశాన్య రాష్ట్రాల్లో ఓటర్ల ఉత్సాహం

సార్వత్రిక ఎన్నికల్లో గతంలోలాగే ఈసారి కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఓటర్లు పోలింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మణిపూర్‌లో 78.2 మంది ఓటేశారు. గత ఎన్నికలతో పోలిస్తే అక్కడ పోలింగ్ శాతం తగ్గింది. 2014లో మణిపూర్‌లో 84.1శాతం మంది ఓటర్లు ఓటేశారు. నాగాలాండ్‌లోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. గత ఎన్నికల్లో అక్కడ 87.8శాతం పోలింగ్ కాగా.. ఈసారి అది 78శాతానికి పరిమితమైంది. సిక్కింలో 69 (80.8), అసోంలో 68 (78.6), మేఘాలయలో 67.2 (68.8), అరుణాచల్‌ప్రదేశ్‌లో 66 (76.6) మిజోరంలో 60 (60.7)శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. అండమాన్ నికోబార్‌లో ఈసారి 70.7శాతం ఓట్లు పోల్ కాగా.. గత సార్వత్రిక ఎన్నికల్లో అది 70.6శాతం కావడం విశేషం.

లక్షద్వీప్‌లో భారీ తగ్గిన ఓటింగ్

లక్షద్వీప్‌లో భారీ తగ్గిన ఓటింగ్

కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో మాత్రం ఈసారి ఓటింగ్ శాతం భారీగా తగ్గింది. 2014లో అక్కడ 86.6శాతం పోలింగ్ నమోదుకాగా.. ఈసారి అది 66శాతానికి పరిమితమైంది. ఇక మిగతా రాష్ట్రాల విషయానికొస్తే ఒడిశాలో 68 (74.6) ఉత్తర్ ప్రదేశ్‌లో 63.7 (65.6)
తెలంగాణలో 60.0 (68.8), ఉత్తరాఖండ్‌లో 57.9 (61.4), మహారాష్ట్రలో 56 (63.8), ఛత్తీస్‌ఘడ్‌లో 56 (59.3),
జమ్మూకాశ్మీర్‌లో 54.5 (56.6), బీహార్‌లో 50 (51.8) శాతం ఓటింగ్ నమోదైంది.

English summary
The First Phase of polling for Lok sabha Election saw long lines of voters in several places but concluded on thursday with turnout across 20 states more or less matching the voting percentages recorded in the 2014 loksabha polls according to ec.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X