వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరుగుతున్న ముస్లిం జనాభా: 2050కి ఇండోనేషియాను మించనున్న భారత్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ జనాభాలో ముస్లిం జనాభా వేగంగా పెరుగుతోందని ఓ అధ్యయనం తేల్చింది. 2050నాటికి హిందువులు మూడో స్థానానికి చేరుకోనుండగా భారతదేశంలో మాత్రం ముస్లిం జనాభా ఆ సమయానికి ఇండోనేషియాను మించిపోతుందని ఆ అధ్యయనం వివరించింది.

అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్ సెంటర్ గురువారం తన అధ్యయన నివేధిక(రిలీజియస్ ప్రొఫైల్ ప్రిడిక్షన్స్)ను విడుదల చేసింది. దీని ప్రకారం 2050నాటికి హిందువుల జనాభా మూడో స్థానంలోకి వస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 34శాతం పెరుగుదల నిష్పత్తి ఉందని పేర్కొంది.

ప్రపంచ జనాభాలో 14.9శాతం హిందూ జనాభా ఉండబోతుందని, వీరిలో ఏ మతంతో సంబంధం పెట్టుకోకుండా ఉండేవారు 13.2శాతం ఉంటారని వివరించింది. ఇక ప్రపంచం మొత్తంలో ముస్లిం జనాభా పెరుగుదల శాతం హిందూ, క్రిస్టియన్ల కన్నా వేగంగా ఉందని నివేదిక పేర్కొంది.

 By 2050, India to surpass Indonesia, will have largest Muslim population: Study

భారతదేశంలో హిందువులు మెజార్టీ వర్గంగా ఉన్నప్పటికీ ప్రపంచంలో ఏ దేశంలో లేని ముస్లిం జనాభా భారతదేశంలో ఉండనుందని తెలిపింది. 'భారత దేశంలో 2050నాటికి హిందువుల జనాభా పెరగొచ్చు. అయితే, ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ముస్లిం జనాభా భారత్‌లో పెరుగుతుంది. అది ఇండోనేషియాను మించిపోతుంది' అని నివేదిక స్పష్టం చేసింది.

2050 నాటికి ముస్లిం జనాభా 2.8 బిలియన్లు ఉండనుందని లేదా ప్రపంచంలో 30శాతం ముస్లిం జనాభా వాటాను కలిగి ఉండనుందని తెలిపింది. ఇక 2.9 బిలియన్లు లేదా 31శాతంతో క్రిస్టియన్ జనాభా ఉండనుందని తెలిపింది. అంటే కొద్ది సంవత్సరాల్లోనే క్రిస్టియన్ జనాభాను వెనక్కినెట్టి ముస్లిం జనాభా మొదటి స్థానంకు వచ్చే అవకాశం ఉంది.

English summary
Hindus will become the world's third largest population by 2050, while India will overtake Indonesia as the country with the largest Muslim population, according to a new study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X