మోడీపై 'తెలుగు' అసంతృప్తి!: ప్రమాణం వీరే.. (పిక్చర్స్)

హైదరాబాద్: నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణ ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో జరిగింది. కొత్త మంత్రుల చేత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణస్వీకారం చేయించారు. నలుగురు కేబినెట్ మంత్రులుగా, ముగ్గురు స్వతంత్ర హోదా సహాయ మంత్రులుగా, పద్నాలుగు మంది సహాయ మంత్రలుగా ప్రమాణస్వీకారం చేశారు. మోడీ కేబినెట్‌ విస్తరణలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రెండు పదవులు దక్కాయి.

తెలంగాణ రాజధానిలోని సికింద్రాబాద్ నుండి గెలుపొందిన బీజేపీ నేత బండారు దత్తాత్రేయ సహాయమంత్రి (స్వతంత్ర), ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సహాయమంత్రిగా ప్రమాణం చేశారు. తొలుత 22మంది ప్రమాణ స్వీకారం చేస్తారనుకున్నప్పటికీ.. శివసేన అలకతో 21 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దత్తాత్రేయ హిందీలో ప్రమాణం చేయగా, సుజనా చౌదరి ఆంగ్లంలో ప్రమాణం చేశారు.

ప్రమాణస్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోడీ, స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీతో పాటు కేంద్ర మంత్రులు, ఆ పార్టీ నేతలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. శనివారం గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మనోహర్ పారికర్ ఆదివారం రాష్టప్రతి భవన్‌లో మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలావుంటే, పార్లమెంటులో ఏ సభకూ చెందని ముగ్గురు.. మనోహర్ పారికర్, సురేష్ ప్రభు, చౌదరి బీరేంద్రసింగ్‌లు ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

కేబినెట్ మంత్రులుగా మనోహర్ పారికర్, సురేష్ ప్రభు, జగత్ ప్రకాశ్ నడ్డా, చౌదరి భీరేంద్ర సింగ్‌లు ప్రమాణం చేశారు. స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా బండారు దత్తాత్రేయ, రాజీవ్ ప్రతాప్ రూఢీ, డాక్టర్ మహేష్ శర్మలు కేబినెట్‌లో స్థానం సంపాదించారు. సహాయ మంత్రులుగా ముక్తార్ అబ్బాస్ నఖ్వి, రాంకృపాల్ యాదవ్, హరిభాయి పార్థ్భాయి చౌదరి, సాంవర్‌లాల్ జాట్, మోహన్ భాయి కండారియా, గిరిరాజ్ సింగ్, హంసరాజ్ గంగారాం అహిర్, డాక్టర్ రాంశంకర్ కఠారియా, వైఎస్ చౌదరి, జయంత్ సిన్హా, రాజవర్దన్ సింగ్ రాథోడ్, బాబుల్ సుబ్రియో బరాల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, విజయ్ సాంప్లాలు ప్రమాణం చేశారు.

కేబినెట్

కేబినెట్

ఆదివారం కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ దృశ్యం.

కేబినెట్

కేబినెట్

ఆదివారం 21 మంది మంత్రులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో మాట్లాడుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

కేబినెట్

కేబినెట్

ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో మనోహర్ పారికర్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

కేబినెట్

కేబినెట్

ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో సురేష్ ప్రభు చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. కాగా, సురేష్ ప్రభు శివసేన నుండి గెలుపొందారు. అయితే, ఉదయం ఆయన సేనకు రాజీనామా చేసి, బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇది ఉద్ధవ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

కేబినెట్

కేబినెట్

ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో బీరేందర్ సింగ్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

కేబినెట్

కేబినెట్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం మధ్యాహ్నం 21 మంది చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జేపీ నడ్డా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్రపతి శుభాకాంక్షలు అందుకుంటున్న దృశ్యం.

కేబినెట్

కేబినెట్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం మధ్యాహ్నం 21 మంది చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్రపతి శుభాకాంక్షలు అందుకుంటున్న దృశ్యం.

కేబినెట్

కేబినెట్

ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో బండారు దత్తాత్రేయ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

కేబినెట్

కేబినెట్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం మధ్యాహ్నం 21 మంది చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముక్తార్ అబ్బాస్ నక్వీ (కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు), రామ్ కృపాల్ యాదవ్, జేపీ నడ్డా (కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు)లు మాట్లాడుకుంటున్న దృశ్యం.

కేబినెట్

కేబినెట్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం మధ్యాహ్నం 21 మంది చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త మంత్రులతో మోడీ, రాష్ట్రపతి ప్రణబ్.

రాజీవ్ ప్రతాప్ రూఢీ

రాజీవ్ ప్రతాప్ రూఢీ

ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో రాజీవ్ ప్రతాప్ రూఢీ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

కేబినెట్

కేబినెట్

ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో గిరిరాజ్ సింగ్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

కేబినెట్

కేబినెట్

ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

కేబినెట్

కేబినెట్

ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో సుజనా చౌదరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+