213 మందిపై క్రిమినల్ కేసులు, 230 మంది కోటిశ్వరులు : ఇదీ ఫస్ట్ ఫేజ్ అభ్యర్థుల చిట్టా
న్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో ఫస్ట్ ఫేజ్ లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 1279 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో కోటీశ్వరులు, నేరస్థుల వివరాలను నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ), అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిమక్ రీఫార్మ్స్ వివరాలు వెల్లడించింది.

నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు
1279 మంది అభ్యర్థుల్లో 213 మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్టు ఉన్నట్టు తమ అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంటే 17 శాతం క్రిమినల్ కేసులు ఉన్నవారని తేలింది. ఇందుల 146 మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 10 మంది తమపై హత్య కేసులు ఉన్నాయని వెల్లడించారు. 25 మంది మాత్రం హత్యాయత్నం కేసులు ఉన్నాయని తెలిపారు.
కాంగ్రెస్ నుంచి ఎక్కువ
పార్టీలవారీగా చూస్తే కాంగ్రెస్ అభ్యర్థులపై ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 83 మందిలో 35 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, బీజేపీ 83 అభ్యర్థుల్లో 30 మంది ఉన్నారని పేర్కొన్నది. కాంగ్రెస్ 22 మంది బీజేపీ 16 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలిపింది. బీఎస్పీ, వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు. ఆయా పార్టీల మొత్తం అభ్యర్థుల్లో 12 మంది వివిధ కేసుల్లో దోషులుగా ఉన్నారని పేర్కొన్నది.
కోటీశ్వరులు కూడా కాంగ్రెస్ నుంచే ఎక్కువ
కోటిశ్వరులు కూడా ఎక్కువే ఉన్నారు. 401 మంది అంటే దాదాపు 32 శాతం తమకు రూ.కోటికి మించి ఆస్తులు ఉన్నట్టు నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థులు 69 మంది అంటే 83 శాతం మంది కోటిశ్వరులు కాగా బీజేపీ 65 మంది అంటే 78 శాతంతో రెండోస్థానంలో ఉంది. బీఎస్పీ నుంచి 32, టీడీపీ నుంచి 25, వైసీపీ నుంచి 22 మంది, టీఆర్ఎస్ నుంచి 17 మంది కోటీకి మించి ఆస్తులను చూపించారు. ఫస్ట్ ఫేజ్ పోటీ చేస్తున్న మహిళల సంఖ్య మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మొత్తం 1279 మంది అభ్యర్థుల్లో 89 మంది మాత్రమే మహిళలు బరిలో ఉన్నారు. అంటే మహిళల వాటా 14 శాతం ఉంది.












Click it and Unblock the Notifications