ఫేస్‌బుక్ ప్రేమ: పాక్‌కు వెళ్లి ప్రియుడిని పెళ్లాడింది
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ఆ ఇద్దరి మధ్య ప్రేమను చిగురింపజేసింది. ఆ తర్వాత ఒకరినొకరు కలుసుకుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నార. అయితే ఆ అబ్బాయి, అమ్మాయి వేర్వేరు దేశాలు. దీంతో ఆ అమ్మాయి ప్రియుడి ప్రేమ కోసం తన దేశాన్ని వదిలి అతని దగ్గరకు వెళ్లింది. పెళ్లి కూడా చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన మెహరున్నీసా(22)కు పాకిస్థాన్ దేశానికి చెందిన ఇజాజ్ ఖాన్(24) ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. వారి స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
ఇందుకోసం మెహరున్నీసా వీసా తీసుకుని రెండు నెలల క్రితం పాక్‌కు వెళ్లింది. వారిద్దరూ గత ఆదివారం పెళ్లి కూడా చేసుకున్నారు. అక్కడి స్వాత్ జిల్లాలోని కలామ్ లోయలో వారి వివాహం జరిగింది. అయితే, అప్పటికే మెహరున్నీసా వీసా గడువు ముగియడానికి ఇంకా మూడు రోజులే సమయం ఉంది. దీంతో ఆమె తన వీసా గడువు పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

ఇంటినుంచి పారిపోయి వచ్చిన ఆమె తిరిగి భారత్‌కు వెళితే పాక్ వ్యతిరేక సంస్థల నుంచి ఆమెకు ప్రమాదం ఉండవచ్చునని, మానవతా దృక్పథంతో ఆమె వీసా గడువు పెంచాలని ఆమె భర్త అభ్యర్థించాడు. అయితే ఆమె వీసా పొడిగింపునకు పాక్ ప్రభుత్వం అంగీకరించలేదని సమాచారం.
ఇది ఇలా ఉండగా, ఓ అమెరికాకు చెందిన యువతి కూడా పాకిస్థాన్ యువకుడిని ప్రేమించింది. అది కూడా ఫేస్ బుక్ ద్వారా పరిచయంతోనే. ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా వివాహం చేసుకున్నారు. అతడ్ని వివాహం చేసుకునే ముందు ఆ యువతి ముస్లిం మతాన్ని స్వీకరించింది.












Click it and Unblock the Notifications