అసహజ శృంగారానికి ఒత్తిడి చేశాడు, అందుకే చంపేశా
జైపూర్: స్వలింగ సంపర్కం (హోమోసెక్సువల్) 19 ఏళ్ల కుర్రాడి పాలిట మృత్యువులా మారింది. అసహజ శృంగారానికి స్నేహితుడిపై ఒత్తిడి చేయడంతో ఇష్టం లేని ఆ స్నేహితుడు ఆ కుర్రాణ్ని హత్య చేసేవరకు వెళ్లింది. ఈ హత్య కేసు రాజస్థాన్‌లోని బుందీ చోటు చేసుకుంది.
ఈ హత్య కేసుకి సంబంధించిన వివరాలను ఎస్సీ భువన్ భూషణ్ యాదవ్ మీడియాకు వివరించారు. బుందీ పట్టణంలోని మహావీర్ నగర్‌లో ఓ సెలూన్‌లో పనిచేసే జాకీర్ మహహ్మద్ (23)కు అదే ప్రాంతంలో ఉండే లోకేంద్ర సింగ్ యాదవ్‌తో పరిచయం ఉంది.
స్కూల్ మధ్యలోనే మానేసిన లోకేంద్ర సింగ్ యాదవ్ డబ్బు కోసం స్వలింగ సంపర్కానికి (హోమోసెక్సువల్) అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే జాకీర్ మహమ్మద్‌తోనూ సెక్స్‌లో పాల్గొనాలని భావించాడు. గత సెప్టెంబర్ 18వ తేదీన వీరిద్దరూ మద్యం తాగేందుకు కోటా-జైపూర్ హైవే పక్కనున్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు.

మద్యం సేవించిన తర్వాత తనతో సెక్స్ చేయాల్సిందిగా జాకీర్ మహమ్మద్‌పై లోకేంద్ర సింగ్ యాదవ్ ఒత్తిడి తెచ్చాడు. వద్దని ఎంత చెప్పినా వినకుండా జాకీర్‌తో సెక్స్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన జాకీర్... యాదవ్ గొంతు నులిమి చంపేశాడు.
ఆ తర్వాత లోకేంద్ర సింగ్ యాదవ్ దుస్తులు, బ్యాగ్, ఐడీ కార్డు సమీపంలో ఉన్న జైత్ సాగర్ సరస్సులో విసిరేసి పారిపోయాడు. నెలరోజుల తర్వాత జాకీర్ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా యాదవ్‌ను హత్యచేసిన వైనాన్ని వెల్లడించాడు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే జాకీర్ చెబుతున్నది అవాస్తమని, తమ కుమారుడు స్వలింగ సంపర్కుడు కాదని యాదవ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications