వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కల్లోలం.. ఉత్తరాఖండ్‌లో 2382 పోలీసులకు వైరస్.. ఐదుగురి మృతి

|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్ లో కూడా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో 2,382 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది. వీరిలో ఐదుగురు చనిపోయారని ఆ రాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది. ఇందులో 93 శాతం మంది కోవిడ్ సోకకముందే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపింది. పోలీసులు మాత్రమే కాకుండా వారి కుటుంబసభ్యుల్లో 751 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందనీ డీఐజీ నిలీష్ ఆనంద్ భర్నే తెలిపారు.

ఐదుగురు మృతి..

ఐదుగురు మృతి..


కరోనా వైరస్ కారణంగా ఐదుగురు జవాన్లు, వారి కుటుంబసభ్యుల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయారని..ఇది చాలా భాధాకారం అని ఆనంద్ భర్నే తెలిపారు. కొవిడ్ రోగులకు మెడికల్ ఆక్సిజన్, బెడ్స్, ప్లాస్మా అందించడానికి గత నెలలో ఉత్తరాఖండ్ పోలీస్ విభాగం.. మిషన్ హౌస్లా అనే ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించిందని..ఇందులో భాగంగా ప్రజలకు సేవలందిస్తున్న క్రమంలో పోలీసులు కరోనా బారినపడ్డారని ఆయన తెలిపారు.

ఆగని సేవలు

ఆగని సేవలు


సమస్యలు ఉన్నప్పటికీ పోలీస్ సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారని..తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. మిషన్ హౌస్లా ప్రాజెక్టు కింద ప్రజల నుంచి 31,815 ఫోన్ కాల్స్ వచ్చాయి. పోలీసులు 2,726 మందికి ఆక్సిజన్ సిలిండర్లు, 792 మంది ఆసుపత్రుల్లో పడకలు, 217 మందికి ప్లాస్మా, రక్తదానం చేశారు.

Recommended Video

TOP NEWS : Congo | Etala Rajender | JP Nadda | Delta Variant
గతేడాది ఇలా..

గతేడాది ఇలా..

ఉత్తరాఖండ్ పోలీసులు 17,609 మందికి మందులు తీసుకోవడానికి సహాయం చేశారు. రేషన్, పాలు, వండిన ఆహారాన్ని 94,484 మందికి అందించారు. 492 మంది కొవిడ్ మృతులకు పోలీసులే దహన సంస్కారాలు చేశారని ఆనంద్ భర్నే తెలిపారు. మొదటి దశ కరోనా వేవ్ సందర్భంగా ఉత్తరాఖండ్ లో 1982 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలగా 8 మంది మృతి చెందారు. ఈ సారి మరింత ఉధృతంగా వైరస్ విలయ తాండవం చేసింది.

English summary
2382 uttarakhand cops infected corona positive. 93 percentage took both doses of vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X