బెంగళూరులో ఆక్సిజన్ కొరత, ఎస్ఓఎస్ జారీ చేసిన 2 ఆస్పత్రులు: 24 మరణాలపై ప్రభుత్వం ఇలా

బెంగళూరు: ఆక్సిజన్ కొరత కారణంగా కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లాలోని కరోనా ఆస్పత్రిలో 24 మంది బాధితులు మృతి చెందిన విషయం విధితమే. అయితే, ఆక్సిజన్ కొరత కారణంగా ఈ మరణాలు సంభవించలేదని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం బీఎస్ యడ్యూరప్ప విచారణకు ఆదేశించారు.

ఇది ఇలావుంటే, తాజాగా, బెంగళూరు నగరంలోని రెండు ఆస్పత్రులు ఆక్సిజన్ ఖాళీ అయ్యిందంటూ ఎస్ఓఎస్ జారీ చేశాయి. ఆర్టీనగర్‌లోని మెడాక్స్ ఆస్పత్రి, రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీలు తమ వద్ద ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, వెంటనే సరఫరా చేయాలని కోరాయి. సోమవారం 5గంటల వరకే ఆక్సిజన్ ఖాళీ అవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నాయి.

 24 Patients Die in Chamarajnagar Due to Lack of Oxygen, Govt Denies Claim: Two Bengaluru hospitals issue oxygen SOS

సీఎం యడ్యూరప్ప వెంటనే స్పందించి ఆక్సిజన్ సరఫరా చేయాలని ఈ రెండు ఆస్పత్రుల యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి. తమ ఆస్పత్రులు మరో చామరాజనగర్ ఆస్పత్రి కాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఆక్సిజన్ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులను ఈ ఆస్పత్రుల నుంచి సమీపంలోని ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

కాగా, కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. ఆదివారం 37,733 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. 217 మంది మరణించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 16,011కు చేరింది. రాష్ట్రంలో మొత్తం 16,01,865 కరోనా పాజిటివ్ కేసులుండగా, ప్రస్తుతం 4,21,436 యాక్టివ్ కేసులున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+