బ్యాంక్ ఉద్యోగం ఇస్తాం రా: గ్యాంగ్ రేప్
అహమ్మద్ నగర్: బ్యాంకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన కామాంధులు 25 ఏళ్ల యువతి మీద సామూహిక అత్యాచారం చేసిన సంఘటన మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లా లో జరిగింది.
గ్యాంగ్ రేప్ చేసిన హరిభా వర్పె (32), విలాస్ రఘునాథ్ షిండే (30) అనే ఇద్దరు కామాంధులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. పరారైన మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
25 ఏళ్ల యువతి డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం వేటలో ఉన్న ఆమెను కో ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న హరిభా వర్పె పరిచయం చేసుకున్నాడు. తాను బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు.

తరువాత అహమ్మద్ నగర్ కు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ధర్మడి హిల్స్ కు ఆమెను పిలుచుకుని వెళ్లారు. అక్కడ ముగ్గురు కామాంధులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు.
అత్యాచారం చేస్తున్న సమయంలో మొబైల్ లో వీడియో చిత్రీకరించారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆమె మొబైల్, నగదు, నగలు లూటీ చేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు రాహురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరిక్షలు చేయించామని పోలీసు అధికారి ప్రతాప్ బావిస్కర్ తెలిపారు.












Click it and Unblock the Notifications