26/11 ముంబై దాడులు: యానివర్సరీకి 4 రోజుల ముందు పాక్ ఇలా
ముంబై ఉగ్రదాడులకు ఆదివారం (26-11-2017కు తొమ్మిదేళ్లు. 2008లో లష్కరే తోయిబాకు చెందిన పదిమంది తీవ్రవాదులు ముంబైలో దాడి చేశారు. ఈ దాడిలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు.
ముంబై: ముంబై ఉగ్రదాడులకు ఆదివారం (26-11-2017కు తొమ్మిదేళ్లు పూర్తయింది. 2008లో లష్కరే తోయిబాకు చెందిన పదిమంది తీవ్రవాదులు ముంబైలో దాడి చేశారు. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా పట్టుబడ్డాడు.
ఈ దాడి వెనుక పాకిస్తాన్ పాత్ర ఉందని ప్రపంచానికి తెలిసింది. కసబ్ వాంగ్మూలం, డేవిడ్ హెడ్లీ ఇచ్చిన సమాచారంతో పాకిస్తాన్ పాత్ర తేటతెల్లమైంది. ఆ తర్వాత కసబ్‌కు ఉరిశిక్ష పడింది. దీంతో ముంబై దాడులకు పూర్తిస్థాయి న్యాయం జరగలేదు.

ముంబై దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్ పాకిస్తాన్‌లో ఉన్నాడు. అతని పాత్రపై భారత్ ఆధారాలు ఇచ్చినా లాభం లేకుండా పోయింది. అంతేకాదు, తాజాగా 26/11 ముంబై దాడులకు నాలుగు రోజుల ముందు సయీద్‌ను విడుదల చేసేందుకు నిర్ణయించారు.
ముంబై దాడుల విషయంలో పాకిస్తాన్ మళ్లీ విచారణ జరపాలని భారత్ డిమాండ్ చేసింది. కానీ పాకిస్తాన్ ఈ విజ్ఞాపనను తోసిపుచ్చింది. సయీద్‌ను కూడా విచారించాలని డిమాండ్ చేస్తోంది. ముంబై దాడుల విచారణ విషయంలో పాకిస్తాన్ ఎన్నడూ సీరియస్‌గా లేదు.
ముంబై దాడుల మరో మాస్టర్ మైండ్ జకీవుర్ రెహ్మాన్ లక్వీకి 2014 డిసెంబర్‌లో బెయిల్ వచ్చింది. ఈ కేసులో లఖ్వీ, అబ్దుల్ వాజిద్, మఝార్ ఇక్బాల్, హమీద్ అమీన్ సాదిఖ్, షహీద్ జమీల్ రిజాయ్, జమీల్ అహ్మద్, యూనిస్ అంజుమ్‌లో విచారణ ఎదుర్కొంటున్నారు. విడుదలైన తర్వాత లఖ్వీ గుర్తు తెలియని ప్రాంతంలో ఉంటున్నాడు. ఇతర ఆరుగురు అనుమానితులు అడియాలా, రావల్పిండి జైల్లో ఉన్నారు.












Click it and Unblock the Notifications