Omicron కేసుల టెన్షన్.. ఇవాళ మరో 3, ఇరవై ఆరుకి చేరిన మొత్తం కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 23 ఉన్న కేసులు ఇవాళ మరో 3 పెరిగాయి. గుజరాత్ జామ్‌ నగర్‌లో రెండు, ముంబై ధారావిలో ఒక కేసు వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 11 కేసులు, రాజస్తాన్‌లో 9, గుజరాత్ 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒక కేసు వచ్చింది. ఇప్పటివరకు వైరస్ సోకిన వారికి స్వల్ప లక్షణాలు బయటపడ్డాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలియజేసింది.

83 మందికి పాజిటివ్.. కానీ

83 మందికి పాజిటివ్.. కానీ

రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చిన 83 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. వీరిలో 13 మందికి ఒమిక్రాన్ వచ్చిందని వివరించారు. ప్రజల ఆరోగ్యంపై ఇప్పటివరకు ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపలేదని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ తెలిపారు. వైరస్ తీవ్రతను పరిశీలిస్తున్నామని.. ఆ తర్వాత వ్యాక్సిన్ గురించి స్పష్టత వస్తోందని వివరించారు. ఒమిక్రాన్ వల్ల.. రోజువారీ పరిశీలన ఉంటుందని చెప్పారు. ఇప్పటివరకు అయితే పరిస్థితి అదుపులోనే ఉందని.. 5 శాతం కన్నా వ్యాప్తి ఉంటే జిల్లా స్థాయిలో ఆంక్షలు తప్పవని స్పష్టంచేశారు.

మాస్క్ ధరించలేదు..

మాస్క్ ధరించలేదు..

దేశంలో ఇప్పటికీ చాలా మంది మాస్క్ ధరించడం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశం అని వివరించారు. వ్యాక్సిన్ తీసుకోవడం.. మాస్క్ ధరించడం రెండు ముఖ్యమేనని చెప్పారు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో అయినా మనందరం జాగ్రత్తగా ఉండాలని కోరారు. చిన్నారులకు వ్యాక్సిన్ గురించి ఇప్పటివరకు సమాచారం తెలియరాలేదు. ఇప్పటివరకు దేశంలో 131 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. యువతకు దాదాపుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. నిన్నటి వరకు 74.5 కోట్ల మంది యువతకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. కేరళలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి.

23 + 3

23 + 3


దేశంలో ఒమిక్రాన్‌ మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు వచ్చాయి. 9 కేసులు రాజస్థాన్‌లో రాగా.. 7 కేసులు మహారాష్ట్రలోని పుణే జిల్లాలో వచ్చాయి. అంతకుముందు కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, ఢిల్లీలో ఒక కేసు బయటపడ్డాయి. సోమవారం ముంబైలో మరో ఇద్దరికి నిర్ధారణ కావడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 23కి పెరిగింది. ఇవాళ మరో 3 కేసులు వచ్చాయి. దీంతో 26కి కేసులు చేరాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+