వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో 27 లక్షలు దాటిన కేసులు .. 51 వేల మరణాలు ..గత 24 గంటల్లో 55,079 కేసులు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కట్టడి సాధ్యం కావటంలేదు. నిత్యం ఇండియాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో 55,079 కేసులు, 876 మరణాలు నమోదయ్యాయి. దీనితో దేశంలో కోవిడ్ -19 సంఖ్య 27,02,743 కు పెరిగింది. ఇందులో 6,73,166 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలుస్తుంది . 19,77,780 మంది డిశ్చార్జ్ అయ్యారు . మరియు 51,797 మంది మరణించారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా కొత్త జన్యువు .. యమా డేంజర్ ... పదిరెట్లు వేగంతో, మరింత తీవ్రంగా ప్రభావం కరోనా కొత్త జన్యువు .. యమా డేంజర్ ... పదిరెట్లు వేగంతో, మరింత తీవ్రంగా ప్రభావం

మహారాష్ట్రలో కరోనా ఉధృతి ,.. పూణేలో అధికంగా

మహారాష్ట్రలో కరోనా ఉధృతి ,.. పూణేలో అధికంగా

మహారాష్ట్రలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతుంది. గరిష్ట సంఖ్యలో కరోనావైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. అత్యధికంగా కేసులు నమోదు అవుతున్న నగరంగా పూణే ఇప్పుడు ముంబైని అధిగమించింది. వాస్తవానికి, ఢిల్లీ తరువాత, ఇది మొత్తం దేశంలోనే అత్యధిక కేసులను నమోదు చేసింది .పూణేలో ఇప్పటివరకు 1,32,481 కేసులు నమోదు కాగా 39,424 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసులు 6,04,358 కాగా , 1,55,268 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 4,28,514 మంది రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు. 20,265 మంది మృతిచెందారు .

రెండో స్థానంలో తమిళనాడు , మూడులో కొనసాగుతున్న ఏపీ .. కేసులు ఎన్నంటే

రెండో స్థానంలో తమిళనాడు , మూడులో కొనసాగుతున్న ఏపీ .. కేసులు ఎన్నంటే

తమిళనాడు రెండో స్థానంలోనే కొనసాగుతుంది. తమిళనాడులో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టటం లేదు. మొత్తం ఇప్పటి వరకు 3,43,945 కరోనా కేసులు నమోదు కాగా , 54,122 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 2,83,937 కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 5,886 మంది మృతి చెందారు . మూడో స్థానంలో ఉన్న ఏపీలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతుంది. మొత్తం 2,96,609 కరోనా కేసులు నమోదు అయ్యాయి . మొత్తం 84,777 యాక్టివ్ కేసులు ఉండగా , 2,09,100 మంది కరోనా నుండి కోలుకున్నారు.

 20 లక్షల మంది కరోనా నుండి రికవరీ

20 లక్షల మంది కరోనా నుండి రికవరీ


కరోనా బాధితుల రికవరీ రేటు 73.18 శాతానికి పెరిగింది .మరణాల రేటు 1.92 శాతానికి చేరింది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా 60 వేలకు తక్కువగా కేసులు నమోదు చేయడంతోపాటు మరణాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్లు గా తెలుస్తోంది ఇప్పటి వరకు ఇండియాలో 20 లక్షల మంది కరోనా నుండి రికవర్ అయ్యారు. భారత దేశంలో కరోనా రికవరీ ల సంఖ్య బాగా ఉండటం ఊరట కలిగించే అంశం కాగా, కరోనా వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం, వివిధ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.

English summary
India today reported a spike of 55,079 cases and 876 deaths in the last 24 hours. With this, the Covid-19 tally in the country rises to 27,02,743 including 6,73,166 active cases, 19,77,780 discharged or migrated and 51,797 deaths, Ministry of Health and Family Welfare said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X