UP: యూపీలో దారుణం.. తొక్కిసలాటలో 107 మంది మృతి..!

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దారుణం జరిగింది. మంగళవారం జరిగిన ఒక మతపరమైన సమావేశంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు పిల్లలతో సహా 107 మంది మరణించారు. ఆగ్రాలోని ADG ఆగ్రా జోన్ కార్యాలయంలోని PRO మొదటి 27 తర్వాత మరణాల సంఖ్య 107కి పెరిగిందని ధృవీకరించారు. హత్రాస్ 'సత్సంగ్' వద్ద తొక్కిసలాటకు ప్రాథమిక కారణం "ఊపిరాడకపోవడమే" అని ప్రాథమికంగా నిర్ధారించారు.

రతీభాన్ పూర్ లో శివునికి సంబంధించిన ఓ ధార్మిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ముగియగానే తొక్కిసలాట జరిగింది. పలువురు మహిళలు, పిల్లలు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. "ఇరవై ఏడు మృతదేహాలు ఎటా ఆసుపత్రికి చేరుకున్నాయి. మరణించిన వారిలో 23 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు మరియు ఒక పురుషుడు ఉన్నారు" అని అధికారి విలేకరులతో అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని తెలిపారు.

27 people died in the stampede in Hatras UP

రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు సికందరరావు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఆశిష్ కుమార్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, క్షతగాత్రులకు ఆసుపత్రిలో సరైన చికిత్స అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పోలీసు డైరెక్టర్ జనరల్‌తో పాటు ఇద్దరు సీనియర్ మంత్రులు, ప్రధాన కార్యదర్శిని సంఘటనా స్థలానికి పంపారు.ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీయడానికి అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆగ్రా, అలీఘర్ కమిషనర్‌తో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI నివేదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+