రైలుకు ఎదురెళ్ళి ప్రాణాలతో బయటపడిందిలా....ఎందుకంటే?

మెట్రో రైల్వే స్టేషన్ లోకి వచ్చిన రైలుకు ఎదురు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన ఓ వైద్యురాలు ప్రాణాలతో బతికింది. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

న్యూఢిల్లీ:మెట్రో రైల్వే స్టేషన్ లోకి వచ్చిన రైలుకు ఎదురు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన ఓ వైద్యురాలు ప్రాణాలతో బతికింది. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన గురుగావ్ లోని మెట్రో స్టేషన్ లో చోటుచేసుకొంది.

ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఓ వైద్యురాలు పనిచేస్తోంది.ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు కాని, రైలుకు ఎదురెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే ఈ ప్రమాదంలో ఆమె గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

గురుగ్రామ్ మెట్రో స్టేషన్ లోని ఫ్లాట్ పాం పై ఆమె అటు ఇటూ నడుస్తూ ఉన్న ఆమె రైలు రాగానే ఒక్కసారిగా పట్టాల మీదికి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.సోమవారం ఉదయం సమయంలో గురు ద్రోణాచార్య మెట్రో స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకొంది.

27-yr-old Delhi doctor survives after jumping in front of Metro, video emerges

ఈ ఘటనతో పది నిమిషాల పాటు రైలు సర్వీసులకు అంతరాయమేర్పడింది.ఇది ఆత్మహత్యా ప్రయత్నం కాదని రైల్వే అధికారులు చెబుతున్నారు. సీసీ టీవి పుటేజీ చూస్తే మాత్రం సరిగా రైలు వచ్చే సమయానికి పట్టాల మీదికి దూకినట్టుగా కన్పిస్తోంది.

దీంతో ఆమెకు పలు చోట్ల గాయాలయ్యాయి.అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.ఆమె కోలుకొన్న తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకొనే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+