29 ఏళ్ళ మహిళపై కత్తితో దాడి, మాజీ భర్తే కారణమా ?
గురువారం రాత్రి ముంబాయిలో 29 ఏళ్ళ మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఆమె చాతీపై కత్తిపోట్లు అయ్యాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ముంబాయి :ముంబాయిలో 29 ఏళ్ళ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కత్తితో ఆమె చాతీపై పొడిచారు. స్థానికులు గుర్తించి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.నిందితులు ఎవరనేది ఇంకా గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. భర్తను వదిలేసి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొంది ఆ యువతి.
29 ఏళ్ళ మహిళ తన భర్తతో విడాకులు తీసుకొంది. తన కొడుకుతో వేరుగా జీవనం సాగిస్తోంది. అయితే భర్తతో దూరమైన తర్వాత 22 ఏళ్ళయువకుడితో ఆమె సంబంధం కొనసాగిస్తోంది. ఈ సంబంధం నేపథ్యంలో దాడి జరిగిందా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆమె ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. తన విధులను ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్థోంది. అయితే ఆమెను కలుసుకొనేందుకు ఆమెతో సంబంధం ఏర్పర్చుకొన్న యువకుడు రావాల్సి ఉంది.
అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి ఏడున్నరగంటల సమయంలో మహలక్ష్మీ రేస్ కోర్స్ సమీపంలో ఆమెపై కత్తితో దాడి చేశారు. ఆమె చాతీపై కత్తితో గాయపర్చారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆమెతో సంబంధం ఏర్పర్చుకొన్న యువకుడు వచ్చాడు ఆమెకు కత్తిపోట్లు అయిన విషయాన్ని గుర్తించి ఆసుపత్రిలో చేర్చాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications