మనిషి మూడడుగులే భద్రతా దళాలకు చుక్కలు: ఎన్‌కౌంటర్‌లో జైషే కమాండర్ హతం

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: జేఈఎమ్‌ ఉగ్రవాద సంస్థలో టాప్‌ కమాండర్‌గా ఉన్న నూర్‌ మహమ్మద్‌ తాంత్రే అలియాస్‌ చోటా నూరాను మంగళవారం తెల్లవారుజామున భద్రత దళాలు మట్టుబెట్టాయి. మూడు అడుగుల ఎత్తు ఉంటారు.అయితే నూర్ మహహ్మద్ తాంత్రే భద్రత దళాలకు చుక్కలు చూపాడు.

జమ్మూ కాశ్మీర్‌లోయలోని త్రాల్ ప్రాంతంంలో నూర్ స్వస్థలంగా పోలీసులు ప్రకటించారు. శ్రీనగర్‌ అంతర్జాతీయ విమానశ్రయం వద్ద బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌పై దాడితో పాటు ఇతర ఉగ్రదాడుల వెనుక నూర్‌ హస్తం ఉన్నట్లు భద్రత దళాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.. గత ఇరవై ఏళ్లలో భద్రతా బలగాలపై జరిగిన అత్యంత శక్తిమంతమైన దాడిగా ఉడి ఉగ్రదాడి గుర్తింపు పొందింది. 2015లో జైషేలో చేరిన నూర్‌కు ఆ తర్వాత కశ్మీర్‌ పరిసరాల్లో జరిగిన ప్రతి ఉగ్ర చర్యకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

3-Feet-Tall Jaish Terrorist Killed Today Was A Big "Headache" For Forces

శ్రీనగర్‌ - జమ్మూ హైవేపై వెళ్తున్న భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఉగ్రదాడికి నూర్‌ వచ్చిన సమయంలో హతమార్చినట్లు జమ్మూ కశ్మీర్‌ డీజీపీ తెలిపారు. ఇంటిలిజెన్స్‌ సమాచారం ద్వారానే నూర్‌ను హతమార్చగలిగామని వెల్లడించారు.

నూర్‌ను 2003లో ఉగ్రవాద నిరోధిత చట్టం(పీఓటీఏ) కింద అరెస్టు చేసినట్లు చెప్పారు. కోర్టు అతనికి జీవిత ఖైదును విధించిందని వివరించారు. అయితే, 2015లో పేరోల్‌పై బయటకు వచ్చిన అతను జైషేతో చేతులు కలిపాడని వెల్లడించారు. గత మూడు నెలల్లో 15 మంది జైషే ముఖ్యనేతలను మట్టుబెట్టామని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three-feet-tall Noor Mohammad Tantray or "Chhota Noora", a top Jaish-e-Mohammed (JeM) terrorist, was killed this morning in an encounter in south Kashmir's Pulwama district. He had been giving sleepless nights to security forces in Jammu and Kashmir for the last six months.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి