ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్ర దాడి, ముగ్గురు జవాన్ల మృతి
జమ్ము కశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ పైన ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పుల్వామా జిల్లాలోని పాంపోర్ సమీపంలో చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ పైన ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పుల్వామా జిల్లాలోని పాంపోర్ సమీపంలో చోటుచేసుకుంది.
కద్లాబల్ ప్రాంతంలో శ్రీనగర్ జమ్ము నేషనల్ హైవే పైన వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

జన సంచారం ఉండటంతో సైనికులు ఎదురుకాల్పులు జరపలేదని, దీంతో దుండగులు తప్పించుకున్నారని సీఆర్పీఎఫ్ ఐజీ తెలిపారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఇదే జాతీయరహదారి పైన మిలిటెంట్స - సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications