అమృత్‌సర్‌లో భారీ పేలుడు, ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
అమృత్‌సర్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ నిరంకారీ భవన్ వద్ద ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో పంజాబ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.
అమృత్‌సర్ జిల్లా రాజస్సని ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. నిరంకారీ భవన్ స్థానిక ఆధ్యాత్మిక మందిరం. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడకి చేరుకున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది.
Spot visuals: Several injured in a blast at Nirankari Bhawan in Amritsar's Rajasansi village. More details awaited. #Punjab pic.twitter.com/Fzk0FW4725
— ANI (@ANI) November 18, 2018
ప్రార్థనా మందిరం వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి పేలుడు పదార్థాలు విసిరినట్లు తెలుస్తోందని స్థానిక పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.













Click it and Unblock the Notifications