Shocking Incident: షాకింగ్ ఘటన.. ముగ్గురు పిల్లల తల్లితో లేచిపోయిన ఇంటర్ విద్యార్థి
Shocking Incident: ఇటీవల కాలంలో షాకింగ్ ఘటనలు జరుగుతున్నాయి. యువకులు ముసలి వారిని పెళ్లి చేసుకున్న ఘటనలను ఎన్నో చూశాం. ఇటీవల ఓ మహిళ పిల్లలను వదిలేసి ప్రియుడితో పారిపోయిన ఘటనను మరువక ముందే మరో ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఈ సారి ముగ్గురు పిల్లలు ఉన్న 36 ఏళ్ల మహిళ ఇంటరి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి(16)తో లేచిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. నాగ్‌పూర్ లోని ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న 36 ఏళ్ల మహిళకు, ఆ బాలుడికి పరిచయం ఏర్పడింది. సదరు మహిళకు అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారి తీసినట్లు తెలిసింది.
అనంతరం ఆ మహిళ, బాలుడు కలిసి పారిపోయారు. బాలుడు కనిపించకపోయేసరికి ఆందోళన పడిన తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో క్రైమ్ బ్రాంచ్ లోని యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వారిని గుర్తించి.. బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సదరు మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ మహిళ విద్యార్థి ఇంటి సమీపంలోనే నివసించేదని.. తరచుగా వీరిద్దరు ఒకే ఆలయానికి వెళ్లే వారని పోలీసులు తెలిపారు.

మహిళ, బాలుడు ఇద్దరు కలిసి డిసెంబర్ 2న పారిపోయారు. 4 నెలల అనంతరం వీరిద్దరిని మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో గుర్తించారు. ఆ మహిళ తన బంగారు ఆభరణాలను అమ్మేసి ఇంటిని అద్దెకు తీసుకుని.. ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసింది. ఆ మహిళ క్యాటరింగ్ సమూహంలో వంట మనిషిగా పని చేసేదని.. ఆ అబ్బాయి సర్వీస్ బాయ్ గా చేశాడని తెలిసింది. నాగ్ పూర్ పోలీసులు వీరు ఎక్కడ ఉంటున్నారో కనిపెట్టి అరెస్ట్ చేశారు. ఆ బాలుడు తన సోదరికి సోషల్ మీడియాలో మెసేజ్ చేయడంతో పోలీసులు వీరు ఎక్కడుంటున్నారనే విషయాన్ని గుర్తించగలిగారు. గతంలో కూడా వీరిద్దరు ఇంటి నుంచి పారిపోయి 4 రోజుల తర్వాత తిరిగి వచ్చినట్లు తెలిసింది. ఆ మహిళ పెద్దకొడుకు వయస్సు 12 కాగా.. ఈ బాలుడి వయస్సు 16 కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications