అక్కడ ఓటు వేయనున్న ప్రధాని మోదీ

Lok Sabha election 2024 phase 3: మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. మంగళవారం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 94 నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. కిందటి నెల 19వ తేదీన 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. 26వ తేదీన 13 రాష్ట్రాల్లో 88 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మొత్తంగా 190 సీట్లల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

3rd phase Lok Sabha elections 2024 PM Modi to cast his vote in Ahmedabad on May 7

మూడో విడత కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలను పూర్తి చేసింది. కర్ణాటక, అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ దామన్, గోవా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లల్లో మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమౌతుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లో గల లోక్‌సభ స్థానాలకూ ఎల్లుండే పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం 26 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. 25 సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు.

సూరత్ స్థానం ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి వేసిన నామినేషన్‌ను తిరస్కరణకు గురైంది. ఫలితంగా- సూరత్ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ఈసీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

3rd phase Lok Sabha elections 2024 PM Modi to cast his vote in Ahmedabad on May 7

ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అహ్మదాబాద్ లోక్‌సభ పరిధిలో ఆయనకు ఓటు హక్కు ఉంది. అహ్మదాబాద్ సిటీ పరిధిలోని నిషాన్ హై సెకెండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉదయం 11 గంటలకు మోదీ ఓటు వేసే అవకాశం ఉంది.

మోదీ రానున్నందున ఈ పోలింగ్ కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. ఓటు విలువను తెలియజేసేలా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. అక్కడి భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ కేంద్రం నుంచి సుమారు 200 మీటర్ల వరకు జనం గుమి కూడి ఉండటాన్ని నిషేధించారు. అహ్మదాబాద్ లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా హస్‌‌ముఖ్ సోమాభాయ్ పటేల్ పోటీలో ఉన్నారు.

కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా..కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాల్లోని 14 నియోజకవర్గాలకు కిందటి నెల 26వ తేదీన పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని మిగిలిన 14 స్థానాలకు మంగళవారం ఓటింగ్ నిర్వహించనున్నారు.

చిక్కోడి, బెళగావి, బాగల్‌కోట్, బిజాపూర్, కలబురగి, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారి, హవేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరుగనుంది. బీజేపీ అభ్యర్థులుగా మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై- హవేరి, బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర- శివమొగ్గ నుంచి పోటీలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+