గుజరాత్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు..
అహ్మదాబాద్: గుజరాత్‌లో భూకంపం సంభవించింది. కచ్ జిల్లాలోని బచావు ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 4గం. సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది.
అయితే భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. దీనిపై స్పందించిన వాతావరణ శాఖ.. స్వల్పంగా భూమి కంపించినట్టు నిర్దారించారు. భూకంపం ధాటికి ప్రజలంతా భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కాగా, ఇదే ఏడాది జనవరి 23న గుజరాత్ లోని జునగత్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.6గా నమోదైంది.












Click it and Unblock the Notifications