పాక్ కాల్పుల్లో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి

శ్రీనగర్: పాకిస్థాన్‌ తన కుటిల బుద్ధిని మార్చుకోవడం లేదు. మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్‌ రేంజర్లు.. భారత జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు అమరులయ్యారు.

సాంబా జిల్లాలోని రామ్‌గఢ్‌ సెక్టార్‌లో గల అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మంగళవారం రాత్రి పాక్‌ రేంజర్స్‌ కాల్పులు జరిపారని సరిహద్దు భద్రతా దళం ఐజీ రామ్‌ అత్వార్‌ తెలిపారు. ఈ ఘటనలో నలుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ర్యాంక్‌ అధికారి కూడా ఉన్నారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

4 BSF personnel martyred after Pakistan violates ceasefire

తొలుత పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడిందని.. వారి చర్యను భారత బలగాలు తిప్పికొట్టాయని అధికారులు చెప్పారు. మంగళవారం రాత్రి నుంచి మొదలైన కాల్పులు బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయని బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు.

Read in English: 4 BSF personnel martyred
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+