కాంగ్రెస్ సంచలన నిర్ణయం..తమిళనాడు సీఎం స్టాలిన్ మద్దతు

త్వరలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకావడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షం నడిచే రాష్ట్రాలపై 'వివక్ష' చూపడమే ఇందుకు కారణమని వేణుగోపాల్ తెలియజేశారు. ఈ బడ్జెట్ చాలా వివక్షత మరియు ప్రమాదకరమైనదిగా ఆయన అభివర్ణించారు.

ఇది కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన ఫెడరలిజం మరియు న్యాయమైన సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. దీనికి నిరసనగా, జూలై 27వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎంలు దూరంగా ఉంటారని కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. సుఖ్వీందర్ సింగ్ సుఖ (హిమాచల్ ప్రదేశ్), సిద్ధరామయ్య (కర్ణాటక) మరియు రేవంత్ రెడ్డి (తెలంగాణ). కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండనున్నారు.

4 CMs to boycott NITI Aayog meeting over discriminatory Budget

ఈసారి బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ, బీహార్‌లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి మిగతా రాష్ట్రాల్ని విస్మరించారన్న విమర్శలు వినిపించాయి. బీజేపీ నేతలు తమ కూర్చిని కాపాడుకునేందుకు ఏపీ, బీహార్‌ రాష్ట్రాలకు బడ్జెట్‌లో అధిక కేటాయింపులు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్డీఏయేతర పాలిత రాష్ట్రాలకు బడ్జెట్‌లో సరైన కేటాయింపులు లేకపోవడం వల్లే నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకావడం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+