కాల్పులకు తెగబడ్డ మావోయిస్టులు: నలుగురు పోలీసులు మృతి
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని లతేహర్ జిల్లాలో దారుణానికి తెగబడ్డారు. నక్సల్స్ జరిపిన దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
శుక్రవారం రాత్రి చంద్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని లుకియతాండ్ గ్రామం సమీపంలో పెట్రోల్ వ్యాన్‌పై సాయుధులైన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అసిస్టెంట్ సబ్‌ఇన్ స్పెక్టర్ కూడా ఉన్నారు.

మృతుల్లో ఏఎస్ఐ సుక్రా ఓరయన్, హోంగార్డ్ జవాన్లు సికందర్ సింగ్, జమున ప్రసాద్, శంభు ప్రసాద్ ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టులు ఇలా దాడులకు పాల్పడటంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications