వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐరాస హెచ్చరిక : 2050లో ఇండియాకు పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం

|
Google Oneindia TeluguNews

పెరుగుతున్న నగరీకరణ భవిష్యత్తులో ఇండియాకు ముప్పుగా పరిణమించనుందని హెచ్చరిస్తోంది ఐక్యరాజ్య సమితి. ఐరాస విడుదల చేసిన ఓ తాజా నివేదిక ఇవే విషయాలను స్పష్టం చేస్తోంది. ఇండియాలో ముఖ్యంగా ముంబాయి, కోల్ కతా దీని బారిన పడే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం 2050 వరకు సముద్ర నీటి మట్టాలు చాలావరకు పెరగడమే.

పెరుగుతున్న సముద్ర మట్టాల వల్ల ఇండియాలోని 40 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, ప్రధానంగా ముంబాయి, కోల్ కతా పైనే ఈ ప్రభావం అధికమని నివేదిక చెబుతోంది. దీనికి కారణం ఈ రెండు నగరాలు మరింత వేగంగా విస్తరిస్తుండడం, ఎక్కువ కోస్తా తీరాన్ని కలిగి ఉండడమేనని, దీనివల్ల వరదలు సంభవించి పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది ఐరాస నివేదిక.

40 million Indians at risk from rising sea levels: UN report

సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ప్రపంచంలో ప్రమాదానికి గురయ్యే 10 ప్రధాన నగరాలలో 7 నగరాలు ఆసియా పసిపిక్‌ ప్రాంతంలోనే ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇందులో అత్యధిక ప్రభావానికి లోనయ్యేది ఇండియా కాగా, బంగ్లాదేశ్‌ (25కోట్ల మంది ప్రభావితం), చైనా (20కోట్లు), ఫిలిప్పిస్స్ (15కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఆసియాలో వేగంగా విస్తరిస్తున్న నగరీకరణే దీనంతటికి కారణమని, దీంతో పాటు సామాజికి ఆర్థిక పరిస్థితులు కొంతమేర ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సూచించింది.

English summary
Nearly 40 million Indians will be at risk from rising sea levels by 2050, with people in Mumbai and Kolkata having the maximum exposure to coastal flooding in future due to rapid urbanisation and economic growth, according to a UN environment report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X