కరోనా కలకలం: పేరంట్‌కు వైరస్ రక్కసి, 40 మందికి పరీక్షలు, స్కూల్‌కు సెలవు, పరీక్షలు రద్దు..

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గుండెల్లో గుబులు పుట్టిస్తోన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో గల నోయిడా స్కూల్‌లో కూడా వైరస్ కలకలం రేపింది. ఓ విద్యార్థి పేరెంట్‌క వైరస్ రావడంతో.. పాఠశాలకు సెలవు ప్రకటించారు. అంతేకాదు తరగతి గదులను శుభ్రపరుస్తున్నారు. 40 మంది చిన్నారులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పేరంట్‌కు వైరస్

పేరంట్‌కు వైరస్

నోయిడాలోని సెక్టార్ 135లో గల శ్రీరామ్ మిలేనియం స్కూల్‌లో ఓ విద్యార్థి తండ్రికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో పాఠశాలను మూసివేశారు. ఆన్యువల్ పరీక్షలను కూడా రద్దు చేశారు. పాఠశాలలో గల 40 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి.. 28 రోజులపాటు ఐసోలేషన్ కోసం పంపించారు. దీనిని గౌతమ్ బుద్ద్ నగర్ ముఖ్య వైద్యాధికారి అనురాగ్ భార్గవ్ ధృవీకరించారు.

40 మందికి టెస్టులు..

40 మందికి టెస్టులు..


విద్యార్థి పేరంట్‌కు వైరస్ సోకిందనే అంశాన్ని స్కూల్ యాజమాన్యం కూడా ధ‌ృవీకరించింది. దీనిపై ఇప్పటికే కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రిత్వ శాఖను సంప్రదించామని తెలిపారు. ఒకటి, రెండురోజుల్లో స్కూల్‌ను శుభ్రపరుస్తామని పేర్కొన్నారు. మెడికల్ టీం తరగతి గదులు, పాఠశాలను శుభ్రపరుస్తారని సీఎంవో అనురాగ్ పేర్కొన్నారు. ఆ 40 మందికి చేసిన పరీక్షలు మంగళవారం వస్తాయని వివరించారు.

ప్రచారం నమ్మొద్దు..

ప్రచారం నమ్మొద్దు..


కరోనా వైరస్ సోకడంతో తాము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. వైరస్ సోకిన పేరంట్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Recommended Video

    Coronavirus In Hyderabad |TS Health Minister Eatala Rajender Explanation On Corona Victim | Oneindia
    పరీక్షలు వాయిదా..

    పరీక్షలు వాయిదా..

    పేరంట్‌కు వైరస్ సోకడంతో వార్షిక పరీక్షలను కూడా రద్దు చేశారు. తర్వాత నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని పే్కొన్నారు. ఏడో తరగతి నుంచి 11వ తరగతి విద్యార్థులు తమకు అదనంగా తరగతులు నిర్వహించాలని కోరితే.. కండక్ట్ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. గతనెల 28వ తేదీన జరిగిన బర్త్ డే వేడుకకు విద్యార్థులు హాజరయ్యారు. తర్వాత విద్యార్థి పేరంట్‌కు వైరస్ సోకిందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+