lockdown: 400 కుటుంబాలకు అందని రేషన్, రోడ్డెక్కిన వందలాది మంది, మాస్క్ మరిచి ఆందోళన..
కరోనా వైరస్ విజృంభించడంతో నిరుపేదలకు పని లేదు. వారికి రేషన్‌తోపాటు కొంతమొత్తం నగదు ఇస్తామని చెబుతోన్న కొన్నిచోట్ల అమలు కావడం లేదు. పశ్చిమబెంగాల్‌లోని డొమకల్ మున్సిపాలిటీలో కూడా పేదలకు సరుకులు అందలేదు. దీంతో ఆగ్రహించిన వారు.. రోడ్డెక్కి నిరసన చేపట్టారు. 400 కుటుంబాలు రహదారి మీద బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది.

కొరత లేదు..
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కొరత లేదని సీఎం మమతా బెనర్జీ స్పష్టంచేశారు. పేదలకు ఉచితంగా అందజేసే సరుకులకు లోటులేదని పేర్కొన్నారు. కానీ గత 20 రోజుల నుంచి డొమకల్ మున్సిపాలిటీలోని కొన్ని కుటుంబాలకు సరుకులు మాత్రం అందడం లేదు. దీంతో బుధవారం ఉదయం బెర్హమ్‌పూర్ డొమకల్ రహదారి మీద బైఠాయించారు. వారిలో చాలామంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. అయితే వారు మాస్క్ ధరించకపోవడం, సోషల్ డిస్టన్స్ పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇవ్వని డీలర్లు..
తమకు అందజేయాల్సిన సరుకులను రేషన్ డీలర్లు ఇవ్వడం లేదని పేదలు ఆరోపించారు. ఒక్కో ఆహార భద్రతా కార్డుదారునికి ఐదో కిలోల బియ్యం, ఐదు కిలోల పిండిని ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. కానీ డొమకల్‌లో మాత్రం పేదలకు పంపిణీ చేయడం లేదు. ఒక్కో కిలో బియ్యం ఇచ్చి డీలర్లు చేతులు దులుపుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కొరత లేదని బెంగాల్ పౌరసరఫరాల మంత్రి జ్యోతిప్రియ మాలిక్ తెలిపారు.

సరిపడ బియ్యం..
ప్రస్తుతం 9.45 మెట్రిక్ టన్నుల బియ్యం తమ వద్ద ఉంది అని.. మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రైస్ మిల్లర్ల వద్ద ఉన్నాయని తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి బియ్యాన్ని బెంగాల్ ప్రభుత్వం సేకరించదని.. ఆగస్ట్ వరకు సరిపడ సరుకులు ఉన్నాయని తెలిపారు. అవసరమనుకుంటే రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. కొందరు రేషన్ డీలర్లు సరుకులు అందజేయడం లేదనే అంశం తమ దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. వారు షాపు కూడా తెరవడం లేదు అని గుర్తించామని.. వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

పదో వార్డులో ఇది పరిస్థితి..
డొమకల్ మున్సిపాలిటీ పదో వార్డులో డీలర్ తమకు సరుకులు అందజేయడం లేదని స్థానికుడు మహబూబ్ దాస్ తెలిపారు. గత రెండువారాల నుంచి కుటుంబానికి కిలో బియ్యం అందజేస్తున్నారు.. ఐదుగురు సభ్యులు ఉన్న ఫ్యామిలీ ఎలా గడపాలి అని ప్రశ్నించారు. ఇక్కడ నివసించే చాలా మంది రోజువారీ కూలీ పనిచేసుకుంటున్నారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి పోయిందని.. దీంతో తమకు ఆహారం అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని పేదలు స్పష్టంచేశారు.

చనిపోవాలా...?
పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు.. మరి మేం చనిపోవాలా అని మరో ఆందోళనకారుడు సుదోబ్ దాస్ ప్రశ్నించారు. తమ ఆందోళనతో ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది.. కానీ తమకు నిరసన తప్ప మరో మార్గం కనిపించడం లేదు అని తెలిపారు. ఘటనాస్థలానికి వచ్చిన టీఎంసీ మున్సిపల్ చైర్మన్ ఇస్లాం.. ఆందోళనకారులకు నచ్చజెప్పి.. ఆందోళనను విరమింపజేశారు.
Recommended Video

40 క్వింటాళ్లు..
డొమకల్‌లో 69 శాతం మంది 1.57 లక్షల మంది ప్రజలు బీపీఎల్ కుటుంబాలేనని స్పష్టంచేశారు. ప్రభుత్వం నుంచి 42 క్వింటాళ్ల రైస్ అందిందని.. మరింత రావాల్సి ఉంది అని ఇస్లాం పేర్కొన్నారు. స్థానిక రేషన్ డీలర్ అర్హులకు రేషన్ ఇవ్వడం లేదు అని తన దృష్టికి వచ్చిందని.. అతనిపై కఠినచర్యలు తీసుకుంటామని ఇస్లాం స్పష్టంచేశారు. ప్రతీ కుటుంబానికి 10 కిలోల బియ్యం, 5 కిలోల బంగాళదుంప అందజేస్తానని హామీనిచ్చానని పేర్కొన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications