వరదల భీభత్సానికి 48 మంది మృతి.. ఎక్కడంటే ?

వరదల భీభత్సానికి ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఓ వైపు వరదలు.. మరోవైపు కొండచరియల విరిగిపడటంతో.. అసోం, మేఘాలయ, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా వర్షాలు పడడంతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

అసోం పరిస్థితి అత్యంత విషమం..

అసోం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర, బరాక్ సహా అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలోని 21 జిల్లాలు వరదల్లో మునిగిపోయాయి, 6.3 లక్షలకుపైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వేలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. 43 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 165 సహాయ శిబిరాలు, 157 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 31,000 మందికి పైగా శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రోడ్డు, రైలు, ఫెర్రీ రవాణా పూర్తిగా స్థంభించిపోయింది.

48-people-died-due-to-the-flood-disaster-at-northeastern-states

సిక్కిం లో కొండచరియల విలయం..

సిక్కింలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలు వందల సంఖ్యలో నమోదయ్యాయి. 552 ఘటనలు గత 10 రోజుల్లో చోటు చేసుకున్నాయి. Mi-17 V5 హెలికాప్టర్ల సహాయంతో 1,700 మందిని రక్షించారు. ఆర్మీ క్యాంప్ పై కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు సైనికులు గల్లంతయ్యారు. ఇంకా ఎనిమిది మంది తీస్తా నదిలో కొట్టుకుపోయిన ఘటనపై గాలింపు కొనసాగుతోంది.

మేఘాలయ, మణిపూర్ లో విపత్తు..

మేఘాలయలో పర్యాటకుడి కోసం NDRF బృందం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. తూర్పు ఖాసీ హిల్స్‌లో వరద ఉధృతికి పర్యాటకుడు మృతి చెందగా, అతని భార్య ఆచూకీ లభించలేదు. మణిపూర్ రాష్ట్రంలో 1.64 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు, 35,000 ఇండ్లు నాశనమయ్యాయి. ఈ క్రమంలోనే అసోం, సిక్కిం ముఖ్యమంత్రులు, మణిపూర్ గవర్నర్‌తో ప్రధాని మోడీ వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

మరణాల గణాంకాలు..

వరదలు, కొండచరియల కారణంగా ఇప్పటివరకు:

అసోం: 17 మంది మృతి

అరుణాచల్‌ప్రదేశ్: 11 మంది

మేఘాలయ: 6 మంది

మిజోరం: 5 మంది

సిక్కిం: 3 మంది

త్రిపుర: 1

బీహార్ (సివాన్ జిల్లా): 7 మంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+