డిసెంబర్ 19న ఇండియా కూటమి సమావేశం: సయోధ్య కుదిరేనా?
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి (I.N.D.I.A alliance) సమావేశం తేదీ ఖరారైంది. డిసెంబర్ 19న కూటమిలోని ఆయా పార్టీల నేతలు దేశ రాజధాని న్యూఢిల్లీలో భేటీ కానుంది. ఈ మేరకు వివరాలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ముందుగా ఈ సమావేశాన్ని గత బుధవారం నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. అయితే, కూటమిలో కీలక నేతలైన సీఎం మమతా బెనర్జీ, సీఎం నితీష్ కుమార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వంటి వారు గైర్హాజరయ్యే అవకాశం ఉండటంతో ఈ భేటీని రద్దు చేశారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో డిసెంబర్ 19న జరిగే ఇండియా కూటమి సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐదు రాష్ట్రాల్లో మూడింటిలో బీజేపీ విజయం సాధించగా.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకంపై కాంగ్రెస్ పార్టీతో ఇతర పార్టీలు చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కూటమిలో విభేదాలు కూడా వెల్లువెత్తుతుండటం గమనార్హం.

ఇప్పటికే కొంత దూరం పెరిగిన కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ మధ్య సయోధ్య కుదిరేందుకు ఈ సమావేశం కీలకం కానుంది. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీతోపాటు టీఎంసీ, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ శరద్ పవార్, శివసేన(ఉద్ధవ్), జేడీయూ, ఆర్జేడీ, కమ్యూనిస్టు, మరికొన్ని చిన్న పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే.
INDIA की पार्टियों के नेताओं की चौथी बैठक मंगलवार 19 दिसंबर 2023 को नई दिल्ली में दोपहर 3 बजे से होगी।
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 10, 2023
The 4th meeting of the leaders of INDIA parties will be held on Tuesday December 19th, 2023 in New Delhi at 3pm.
जुड़ेगा भारत
जीतेगा INDIA!
కూటమి తొలి సమావేశాన్ని బీహార్ సీఎం నితీష్ కుమార్ పాట్నాలో నిర్వహించగా.. బెంగళూరులో రెండో సమావేశం జరగ్గా.. మూడో సమావేశం ముంబైలో జరిగింది. ఇప్పుడు జరిగే నాలుగో సమావేశం మరింత కీలకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా పోటీ చేయడంతో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైందని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. ఈ సమావేశంతో కూటమి పార్టీలు ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications