అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భక్తులు మృతి
మహారాష్ట్రలోని సోలాపూర్- పూణె జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు భక్తులు మృతి చెందారు. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దేవ్ ధారి పటీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమీప ఆలయంలో దర్శనం చేసుకుని మరో ఆలయానికి చేరుకునే క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
సోలాపూర్- పూణె జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ఓ కారు ఓవర్ స్పీడ్ కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులోని ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. భక్తులంతా పాన్వెల్ నుంచి అక్కల్ కోట్ కు దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శనివారం డిసెంబర్ 18న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది.
భక్తులు ప్రయాణిస్తున్న కారు దేవ్ ధారి పాటి లోని మోహోల్ ప్రాంతం సమీపంలోకి రాగానే డ్రైవర్ కంట్రోల్ తప్పాడు. ఓవర్ స్పీడ్ కారణంగా రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. కారులోని ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆమె మోహోల్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

అయితే ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగం అని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఓవర్ స్పీడ్ కారణంగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టినట్లు నిర్దారించారు. ఈ మేరకు అధికారులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో హైవేలపై ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications