విశాఖలో పేలుడు: కాన్పూర్ గ్యాస్ లీక్‌తో 5గురు మృతి
విశాఖపట్నం/ కాన్పూర్: విశాఖపట్నం నగరంలోని పరవాడ ఫార్మాసిటీలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. గ్లోకెమ్ ఫార్మా కంపెనీలో అమ్మోనియం ట్యాంక్ పేలిన ఘటనలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను గాజువాకలోని పలు ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిరుడు మే 30న ఇదే కంపెనీలో భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తువ విషయవాయువులు వెలువడి చుట్టుప్రక్కల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిన విషయం తెలిసిందే.

ఇదిలావుంటే, కాన్పూర్ చమన్‌గంజ్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఐదుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం సంభవించింది. చమన్‌గంజ్‌కు చెందిన అనిల్ అనే వ్యక్తి లీకవుతున్న గ్యాస్ సిలిండర్‌ను పబ్లిక్ టాయిలెట్‌లోని నీళ్ల ట్యాంక్‌లో పెట్టాడని పోలీసులు శనివారం చెప్పారు.
నీళ్ల ట్యాంక్ ఖాళీగా ఉండడంతో లీకైన గ్యాస్ వ్యాపించింది. ఇంతలో ఓ వ్యక్తి టాయిలెట్‌లోకి వెళ్లి సిగరెట్ వెలిగించుకున్నాడు. దీంతో మంటలు లేచాయి. మంటల్లో ఐదుగురు మరణిచారు. మరణించినవారిని అనురాగ్ (12), సీతాదేవి (40), హసీనా (48), అనిల్ (24), సునీల్ (29)లుగా గుర్తించారు. గాయపడినవారిలో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.












Click it and Unblock the Notifications